ఎమిరేట్స్‌లో ఓ మొబైల్ కంపెనీ త‌న పేరును మార్చేసుకుంది..కొత్త పేరేమిటంటే!

యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌లో ఓ టాప్ మొబైల్ కంపెనీ త‌న పేరును మార్చుకుంది. `జ‌యేద్ హ్యూమ‌నైటేరియ‌న్ డే`గా బ‌ద‌లాయించుకుంది. దీనికి కార‌ణం- ఎమిరేట్స్ మాజీ రాజు, దివంగ‌త షేక్ జ‌యేద్ బిన్ సుల్తాన్ అల్ న‌హ్యాన్ స్మార‌క దినోత్స‌వం. జ‌యేద్ బిన్ సుల్తాన్ గౌర‌వార్థం.. ఆ మొబైల్ కంపెనీ త‌న పేరును మార్చుకుంది.

మొబైల్ ఫోన్ల‌లో నెట్‌వ‌ర్క్ పేరు స్థానంలో జయేద్ బిన్ పేరు ప్ర‌త్య‌క్షం కావ‌డం ఒకింత ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. వినియోగ‌దారులు దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ల‌ను తీసి, వాటిని సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. రంజాన్ మాసం ముగిసిన త‌రువాత ఈ పేరును తొల‌గించి, పాత పేరును పునరుద్ధ‌రిస్తామ‌ని ఆ మొబైల్ కంపెనీ వెల్ల‌డించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here