యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ అధ్య‌క్షుడు తీసుకున్న ఈ నిర్ణ‌యంతో..వారి జీవితం బంగారుమ‌యం!

యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ అధ్య‌క్షుడు షేఖ్ ఖ‌లిఫా బిన్ జ‌యేద్ అల్ న‌హ్యాన్ తీసుకున్న ఓ నిర్ణ‌యం.. జైలు ప‌క్షుల్లో ఆశ‌లు మొల‌కెత్తించింది. వారి జీవితాల్లో వెలుగు నింపింది. అయిదు కాదు, 10 కాదు ఏకంగా 935 మంది ఖైదీల‌ను విడుద‌ల చేయాల‌ని షేఖ్ ఖ‌లీఫా బిన్ జయేద్‌.. ఆదేశాలు జారీ చేశారు.

 

ప‌విత్ర రంజాన్ మాసాన్ని పుర‌స్క‌రించుకుని ఆయ‌న ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. వివిధ నేరాల‌ను చేసి, కారాగారాల్లో మ‌గ్గుతున్న 935 మందీ రంజాన్ ఉప‌వాస రోజులు ఆరంభానికి ముందే విడుద‌ల కానున్నారు. రంజాన్ మాసం సంద‌ర్భంగా ఆయా ఖైదీలకు కొత్త జీవితాన్ని ప్ర‌సాదించేలా ఖ‌లీఫా బిన్ జ‌యేద్ ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here