కారు బోల్తా: దాని నిండా బ్లెండ‌ర్స్‌ప్రైడ్‌, రాయ‌ల్‌స్టాగ్ బోటిల్స్‌! అది తెలిసిన జ‌నం..!

అతి వేగంతో అదుపు త‌ప్పిన ఓ కారు రోడ్డు ప‌క్క‌న ప‌ల్టీలు కొట్టింది. ప‌ద‌డుగుల వ‌ర‌కు ఏట‌వాలుగా ఉన్న ప్రదేశంలో ప‌డిపోయింది. ప్ర‌మాదం ఎప్పుడు జ‌రిగిందో తెలియ‌ట్లేదు గానీ.. ప్ర‌మాదానికి గురైన కారులో నుంచి ఘాటైన మ‌ద్యం వాస‌న అటుగా వెళ్తున్న వాహ‌న‌దారులకు సోకింది.

అంతే- క్ష‌ణం కూడా ఆల‌స్యం చేయ‌లేదు. కారు వ‌ద్ద‌కు ప‌రుగులు తీశారు. డిక్కీని, డోర్ల‌ను తెరిచి వాటి మీద ప‌డ్డారు. అందిన కాడికి దోచుకున్నారు. ఏమిట‌ని అడ‌క్కండి.

మ‌ద్యం బోటిల్స్‌. రాయ‌ల్‌స్టాగ్‌, బ్లెండ‌ర్స్ ప్రైడ్ బోటిళ్ల‌ను రెండు చేతులా ప‌ట్టుకెళ్లారు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉజ్జ‌యినీ స‌మీపంలో చోటు చేసుకుని ఉంటుంద‌ని అనుమానిస్తున్నారు.

ఎందుకంటే- ఆ ప్రాంతానికి చెందిన లియాఖ‌త్ మున్షీ అనే వ్య‌క్తి దీన్ని వీడియో తీసి, త‌న ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు కాబ‌ట్టి. పైగా వారు మాట్లాడుతున్న‌ది కూడా హిందీ.

కొంద‌రు ఏకంగా మ‌ద్యం బోటిళ్ల కేసుల‌నే ఎత్తుకెళ్తోన్న దృశ్యాలు ఈ వీడియోలో క‌నిపిస్తున్నాయి. పొలాల్లో పనిచేసేవాళ్లు పరుగున వచ్చి, కారులోని మద్యం బాటిళ్లు అందుకున్న దృశ్యాన్ని చూడొచ్చు.

एक्सीडेंट के बाद लोग कुछ इस तरहा से समाज सेवा कर रहे है।

Liyakatmunshi Ali Munshiさんの投稿 2018年1月17日(水)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here