ఇంట్లో పాత సామాన్ల మ‌ధ్య మ‌హిళ మృత‌దేహం! 30 ఏళ్ల కింద‌ట చ‌నిపోయిన త‌ల్లిదంటోన్న కూతురు

కీవ్‌: పింఛన్ డ‌బ్బుల కోసం త‌ల్లి మృత‌దేహాన్ని 30 ఏళ్లుగా ఇంట్లోనే పెట్టుకుందో కుమార్తె. త‌న త‌ల్లి జీవించే ఉంద‌ని న‌మ్మిస్తూ, ఆమె పేరు మీద వ‌చ్చే పింఛ‌న్ మొత్తాన్ని తాను తీసుకునేది. చివ‌రికి- ఆమె ప్ర‌వ‌ర్త‌న‌పై ఎవ‌రికీ అనుమానాలు రాలేదు. చివ‌రికి- పొరుగింటి వాళ్ల‌కు అనుమానం వ‌చ్చి, పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది ఉక్రెయిన్‌లోని మైకొలాయివ్ సిటీలో. పింఛ‌న్ డ‌బ్బుల కోసం త‌ల్లి మృత‌దేహానికి అంతిమ సంస్కారాలు కూడా చేయ‌కుండా 30 ఏళ్ల పాటు ఇంట్లో పెట్టుకుంద‌ని పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది. ఆమె పేరు స‌సెన్‌.

77 సంవ‌త్స‌రాలు. త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి మైకొలాయివ్ సిటీలో నివ‌సిస్తుండేది. తండ్రి ప్ర‌భుత్వ ఉద్యోగి. ఆయ‌న మ‌ర‌ణించ‌గా.. పింఛ‌న్ డ‌బ్బులు పెద్ద‌మొత్తంలో స‌సెన్ త‌ల్లికి అందుతుండేవి. 30 ఏళ్ల కింద‌ట ఆమె కూడా మ‌ర‌ణించింది. ఈ విష‌యం తెలిస్తే పింఛ‌న్ సొమ్ములు త‌న‌కు రావ‌నే అనుమానంతో త‌ల్లి మ‌ర‌ణించిన విష‌యాన్ని ఎవ‌రికీ చెప్ప‌లేదు.

ఆమె మృత‌దేహాన్ని ర‌సాయ‌నాల‌ను పూసి, మ‌మ్మీగా మార్చింది. ఇంట్లో సోఫా కింద దాచి పెట్టింది. మృత‌దేహం క‌నిపించ‌కుండా దిన‌ప‌త్రిక‌లు స‌హా ఇత‌ర పాత సామాన్ల‌ను పేర్చింది. వాటి మ‌ధ్య‌న పెట్టింది. ఫ‌లితంగా.. ఇళ్లంతా ఓ డంప్‌యార్డ్‌లాగా త‌యారైంది. ఆమె ప్ర‌వ‌ర్త‌న‌పై ఎవ‌రికీ అనుమానం రాలేదు.

ఇలా 30 ఏళ్ల పాటు ఈ విష‌యాన్ని దాచి పెట్టింది. 77 ఏళ్ల వ‌య‌స్సులో స‌సెన్ కూడా అనారోగ్యానికి గురైంది. న‌డ‌వ‌లేని స్థితికి చేరుకుంది. ఈ పరిస్థితుల్లో తొలిసారిగా ఆమె ఇంట్లోకి అడుగుపెట్టారు స్థానికులు. దీనితో అస‌లు విష‌యం బ‌హిర్గ‌త‌మైంది.

వెంట‌నే వారు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే స‌సెన్ ఇంటికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స కోసం స‌సెన్‌ను కూడా ఆసుప‌త్రికి తీసుకెళ్లారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here