అంపైర్ తలపై బంతి వచ్చి పడింది..!

సాధారణంగా ఓవర్ అయిపోగానే బంతిని అంపైర్ కు ఇచ్చేస్తూ ఉండాలి.. దూరం నుండి ఫీల్డర్లు అంపైర్ కు బంతిని విసురుతూ ఉంటారు. అలా విసిరే క్రమంలో ముంబై, హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ లో అంపైర్ తల మీద పడింది. ఈ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్‌ సీకే నందన్ తలపైకి పొరపాటున ముంబయి ఇండియన్స్ ఫీల్డర్ సూర్యకుమార్ యాదవ్ బంతిని విసిరాడు.

148 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 5.5 ఓవర్లు ముగిసే సమయానికి 52/0తో నిలిచింది. జస్‌ప్రీత్ బుమ్రా విసిరిన బంతిని ధావన్ బ్యాట్ అంచున తాకిన బంతి…డీప్‌ఫైన్‌లెగ్ దిశగా బౌండరీకి వెళ్లిపోయింది. ఫీల్డర్ ఎవరూ బౌండరీ లైన్‌కి సమీపంలో లేకపోవడంతో.. ముంబయి ఇండియన్స్ డగౌడ్‌లోకి వెళ్లిన బంతిని అక్కడ ఉన్న ఆటగాళ్లు మైదానంలోని ఫీల్డర్ సూర్యకుమార్ యాదవ్‌కి అందించారు. ఈ బంతితో 6 ఓవర్లు ముగియడంతో.. ముంబయి జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ స్ట్రాటెజిక్ టైమ్ అవుట్ (బ్రేక్) కోరాడు. ఫీల్డ్ అంపైర్ నందన్ బ్రేక్ సిగ్నల్ ఇచ్చి పక్కకి వచ్చిన క్షణాల వ్యవధిలోనే అతని తలపై బంతి పడింది. సూర్యకుమార్ యాదవ్ అంపైర్ నందన్‌కి బంతిని ఇచ్చే ఉద్దేశంతో విసరగా.. అది వెళ్లి.. నందన్ తలపై పడింది. పొరపాటుగా జరిగిన ఘటన కాబట్టి అంపైర్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నొప్పిని తట్టుకోడానికి కాసేపు ఐస్‌బ్యాగ్‌ని నందన్ తన తలపై ఉంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here