నిరుద్యోగ భృతి అమలుపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన.. మీరు అర్హులో కాదో తెలుసుకోండి..!

గత ఎన్నికల ముందు తెలుగుదేశం ప్రభుత్వం చెప్పిన మాట.. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నిరుద్యోగులకు 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని.. అయితే నాలుగేళ్ళ తర్వాత ఆ అంశంపై తొలి అడుగువేసింది అక్కడి ప్రభుత్వం. ముందు చెప్పినట్లు 2000 రూపాయలు కాకపోయినా 1000 రూపాయలు మాత్రమే ఇస్తారట.. అది కూడా కొన్ని కండీషన్లు పెట్టారు.

రాష్ట్రంలోని 10 లక్షల మంది యువతకు నెలకు1000 రూపాయల చొప్పున చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. డిగ్రీ లేక డిప్లొమా పూర్తి చేసిన వారే నిరుద్యోగ భృతి పొందేందుకు అర్హులుగా పేర్కొంది. నిరుద్యోగ భృతి కోసం ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. కుటుంబంలో ఎంతమంది అర్హులున్నా అందరికీ వర్తిస్తుందట. అభ్యర్థులు దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న కుటుంబానికి చెందిన వారై ఉండడమే కాకుండా.. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఇక అభ్యర్థుల వయసు 22 నుంచి 35 సంవత్సరాల మధ్య వుండాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here