ఇదేమి రియాలిటీ షో రా బాబోయ్.. భార్యలను మార్చుకోవచ్చట..!

మన వాళ్లకు బిగ్ బాస్ టీవీ షోనే చాలా కొత్తగా అనిపించింది. ఇక పాశ్చాత్య దేశాలలో ప్రస్తుతం నడుస్తున్న టీవీ షోల గురించి తెలిస్తే మన వాళ్ళు మామూలుగా షాక్ అవ్వరు. ఎందుకంటే అక్కడ రియాలిటీ షోల పేరుతో చేస్తున్న పనులు చాలానే ఉంటున్నాయి.

తమ భార్యలతో ఎవరైతే సంతోషంగా ఉండరో.. వాళ్ళందరినీ ఓ చోటుకు తీసుకొని వస్తారు. అక్కడ ఒకరి భార్యలతో ఒకరిని మార్చుకుంటారు.. వింటుంటూనే మనకు ఏదోలా అనిపిస్తోంది కదూ.. ఏమి చేద్దాం ఆ టీవీ షో థీమ్ ఇదేనట..! మార్చుకున్న తర్వాత సొంత భార్యగానే ట్రీట్ చేయాలట.. అంతే కాకుండా భార్యతో ఎలా ఉండారో అన్నీ అక్కడ కెమెరాల మధ్య రికార్డు అవుతూ ఉంటాయి. చివరికి పడకగదిని కూడా వేరే వ్యక్తి భార్యలతో పంచుకోవచ్చు.

ఛానల్ 4 ఈ టీవీ షోను టెలీకాస్ట్ చేస్తోంది. మొత్తం నాలుగు జంటలు ఈ రియాలిటీ టీవీ షోలో పాల్గొంటూ ఉన్నాయి. వీరిలో ఒకరికి మరొకరితో పరిచయం లేదు. వీళ్ళందరినీ థాయ్ లాండ్ లోని ఓ రిసార్ట్ లో వదిలిపెడతారు. అక్కడ విల్లాలో మొత్తం షో నడుస్తుంది. నిక్కీ అండ్ సైమన్, రేచల్ అండ్ టామ్, మిషెల్లీ అండ్ జార్జ్, గెమ్మా అండ్ టోనీ ను ఈ రియాలిటీ షోలలో పాల్గొంటున్న జంటలు. మొదట ఆ జంటలు కలిసి ఉండాలేమో అని అనుకున్నాయి.. కానీ థాయ్ లాండ్ లోకి వచ్చిన తర్వాత వేరే జంట లో ఉన్న మగ, లేదా ఆడవారితో జట్టు కట్టాలని నిర్ణయం తీసుకున్నారు షో నిర్వాహకులు. షో పూర్తీ అయ్యే లోగా వారు తమ సొంత భర్తల దగ్గరకు వెళతారా లేదా.. ఇప్పుడు ఉన్న వ్యక్తులతో ఉండడానికి ఇష్టపడతారా అన్నది షో చివర్లో తెలుస్తుంది. ఇంతకూ టీవీ షో పేరు చెప్పలేదు కదా ‘Seven Year Switch’.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here