విద్యుత్ స్తంభంపైకెక్కి..క‌రెంటు తీగ‌ల‌ను ప‌ట్టుకుని!

మండ్య‌: గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఒక‌రు విద్యుత్ స్తంభంపైకెక్కి, క‌రెంటు తీగ‌ల‌ను ప‌ట్టుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని మండ్య జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని మ‌ద్దూరు తాలూకా ఉప్పిన‌కెరె గేట్ స‌మీపంలో ఈ ఘ‌ట‌న సంభ‌వించింది.

మృతుడి వివ‌రాలు తెలియ రావ‌ట్లేదు. సుమారు 45 సంవ‌త్స‌రాలు ఉంటాయ‌ని పోలీసులు చెబుతున్నారు. మ‌ద్దూరు-కెఎం దొడ్డి మార్గంలోని ఉప్పిన‌కెరె గేట్ స‌మీపంలో క‌రెంటు స్తంభానికి వేలాడుతూ క‌నిపించింది ఈ మృత‌దేహం.

సోమ‌వారం ఉద‌యం పొలం ప‌నుల‌కు వెళ్లిన రైతులు ఈ మృత‌దేహాన్ని చూసి, మ‌ద్దూరు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు విద్యుత్ సిబ్బంది స‌హ‌కారంతో మృతదేహాన్ని కిందికి దించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here