రంజాన్ బంప‌ర్ ఆఫ‌ర్‌! ఉద్యోగుల‌కు బోన‌స్ ప్ర‌క‌టించి దుబాయ్ ప్రైవేటు సంస్థ

దుబాయ్‌: ప‌విత్ర రంజాన్ మాసాన్ని పుర‌స్క‌రించుకుని యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కు ఒక నెల వేత‌నాన్ని బోన‌స్ ప్ర‌క‌టించింది. ప్ర‌భుత్వం నుంచి ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే.. ఓ ప్రైవేటు సంస్థ కూడా అదే బాట‌లో న‌డిచింది.

త‌మ సంస్థ‌లో ప‌నిచేసే ఉద్యోగులంద‌రికీ ఒక నెల వేత‌నాన్ని బోన‌స్‌గా ఇస్తున్న‌ట్టు వెల్ల‌డించింది. ఆ సంస్థ యూనియ‌న్ కోఆప‌రేటివ్ సొసైటీ. ఉద్యోగుల మూల వేత‌న మొత్తాన్ని బోన‌స్‌గా ఇస్తామ‌ని యూనియ‌న్ కోఆప‌రేటివ్ సొసైటీ ఛైర్మ‌న్ మాజిద్ హ‌మ‌ద్ అల్ షామ్సీ తెలిపారు.

మే 6వ తేదీన దివంగ‌త షేఖ్ జ‌యేద్ బిన్ సుల్తాన్ అల్ న‌హ్యాన్ శ‌త‌జ‌యంతి ఉత్సవాల‌తో పాటు.. రంజాన్ మాసాన్ని పుర‌స్క‌రించుకుని ఈ బోన‌స్ ప్ర‌క‌టించిన‌ట్లు మాజిద్ వెల్ల‌డించారు. ఉద్యోగుల‌కు ఒక నెల మూత వేత‌న మొత్తాన్ని బోన‌స్‌గా చెల్లిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన మొట్ట‌మొద‌టి ప్రైవేటు సంస్థ త‌మ‌దేన‌ని సొసైటీ సీఈఓ ఖాలిద్ హుమైద్ బిన్ దిబ‌న్ అల్ ఫ‌లాసి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here