గెడ్డం గీసుకొచ్చేంత వ‌ర‌కూ వ‌రుడిని పెళ్లి పీట‌లు ఎక్క‌నివ్వ‌లేదుగా!

భోపాల్‌: ఓ పెళ్లి కుమారుడికి వింత అనుభ‌వం ఎదురైంది. స్టైల్‌గా ఉంటుంద‌నే ఉద్దేశంతో గెడ్డాన్ని ట్రిమ్ చేసుకొని వ‌చ్చాడా వ‌రుడు. గుర్ర‌మెక్కి, ఊరేగింపుగా క‌ళ్యాణ‌మంట‌పానికి చేరుకున్నాడు. అత‌గాడిని చూసిన వ‌ధువు తండ్రి, కాబోయే మామ ఊర‌కే ఉండ‌లేదు. గెడ్డంతో ఎందుకొచ్చావ్ అంటూ నిల‌దీశాడు.

గెడ్డం గీసుకొచ్చేంత వ‌ర‌కూ పెళ్లి పీట‌లు ఎక్క‌నివ్వ‌బోన‌నీ హెచ్చ‌రించాడు. అస‌లే పెళ్లి కుమారుడు. నేనేమీ త‌క్కువ తిన‌లేద‌నుకున్న ఆ వ‌రుడు కూడా గెడ్డం గీయ‌డానికి భీష్మంచాడు. తీయ‌బోన‌నీ శ‌ప‌థం చేశాడు. చివ‌రికి ఈ విష‌యం పోలీసుల దాకా వెళ్లింది. ఇదెక్క‌డి త‌ల‌నొప్పిరా బాబూ అనుకుంటూ పోలీసులు ఇద్ద‌ర్నీ కూర్చోబెట్టి, స‌ర్దిచెప్పారు.

దీనితో- సోమ‌వారం జ‌ర‌గాల్సిన పెళ్లి మంగ‌ళ‌వారానికి వాయిదా ప‌డింది. బెట్టు వీడిన వ‌రుడు మెట్టు దిగాడు. వ‌ధువు మెడ‌లో తాళి క‌ట్టాడు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఖండ్వా జిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాలోని అజంటీ గ్రామానికి చెందిన రాధేశ్యామ్ త‌న కుమార్తె వివాహాన్ని అదే జిల్లాలోని జూనాపానీ గ్రామానికి చెందిన మంగ‌ళ్ చౌహాన్‌తో నిర్ణ‌యించాడు. సోమ‌వారం రాత్రి ఈ పెళ్లి జ‌ర‌గాల్సి ఉంది. గెడ్డం కార‌ణంగా.. అటు వ‌రుడు, ఇటు వ‌ధువు కుటుంబీకుల్లో గొడ‌వ రావ‌డం, వాగ్వివాదం చోటు చేసుకోవ‌డం, చివ‌రికి పోలీసులూ జోక్యం చేసుకోవ‌డం, చివ‌రాఖ‌రికి- బెట్టు వీడ‌టంతో మంగ‌ళ్ చౌహాన్ పెళ్లి మంగ‌ళ‌వారం సాయంత్రం జ‌రిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here