కారులో వ‌చ్చారు..ఇరుకు సందులో ఇంటి మెట్ల‌పై ఓ మూట‌ను ప‌డేసి వెళ్లారు! ఆ మూట‌లో..!

ఓ ఇరుకు సందు. ఓ కారు వెళ్లేంత స్థ‌లం మాత్రమే ఉండే వీధి అది. అలాంటి సందులో దూరిందో కారు. కొంత‌దూరం వెళ్లిన త‌రువాత కారులో నుంచి కాలు కింద పెట్ట‌కుండానే ఓ మ‌హిళ.. ఓ మూట‌ను ఆ వీధిలో ఉండే ఓ ఇంటి మెట్ల మీద ప‌డేసి వెళ్లిపోయాడు.

ఆ మూట‌లో నుంచి వినిపిస్తోన్న ఏడుపు శ‌బ్దాన్ని విన్న ఆ ఇంటి య‌జ‌మాని వెళ్లి చూడ‌గా.. అందులో ఓ ప‌సికందు గుక్క తిప్పుకోకుండా ఏడుస్తూ క‌నిపించింది. ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో చోటుచేసుకుంది. పొత్తిళ్లలో ఉండాల్సిన పసికందును ఏమాత్రం దయ లేకుండా వీధిలో వదిలేసి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి.

బూడిద రంగులో ఉన్న శాంత్రో కారు అది. ఈ వీడియో సోషల్‌ మీడియాలోకి రావడంతో వైరల్‌గా మారింది. పాప ఏడుపు విన్న స్థానికులు చిన్నారిని గుర్తించి ఆస్పత్రిలో చేర్పించారు. పాపకు చికిత్స అందిస్తున్నారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని జిల్లా ఆసుప‌త్రి చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ వెల్లడించారు. సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here