ఉన్నావో రేప్ కేసులో మరో ట్విస్ట్.. ఇద్దరు వ్యక్తులు మిస్సింగ్..!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్నావో రేప్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు.. ఎమ్మెల్యే అన్న అహంకారంతో అతడు చేసిన ఘోరం బయటకు వచ్చింది. ఇలాంటి తరుణంలో ఎమ్మెల్యే వర్గం గూండాలు.. బాధితురాలి బంధువుల మీదకు దాడి చేశారట. మాట్లాడే వాళ్ళే లేకుండా చేయాలని భావించారు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు.. ఇప్పుడు ఈ విషయం మీద అక్కడి ప్రజలు మరింత సీరియస్ అయ్యారు. ఉన్నావో రేప్ కేసు బాధితురాలి బంధువులు ఉన్న ఊరిపై నిందితుడు, బీజేపీ ఎమ్మెల్యే కుల్ దీప్ సెంగార్ కు చెందిన గూండాలు దాడి చేశారు.


రెండు కార్లలో గూండాలు అక్కడికి వచ్చి దాడి చేసి వెళ్లిపోయారు. తరువాత ఇద్దరు వ్యక్తులు కనిపించడం లేదు. ఎమ్మెల్యే మనుషులు తమ గ్రామంపై దాడి చేసి, తమను బెదిరించారని, ఈ కేసు విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడవద్దని హెచ్చరించారని బాధితురాలి మామ మీడియాకు తెలిపారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసును తీవ్రంగా పరిగణిస్తున్న పోలీసులు, దాడికి పాల్పడిన వారిని గుర్తించే ప్రయత్నాలు ప్రారంభించారు. అదృశ్యమైన వారి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సెంగార్ ను ఏడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ, అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ కేసు విషయంలో భారతీయులు ఎంతో కోపంగా ఉన్నారు. సెంగార్ ను ఉరితీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here