రాజ్ పుత్ లూ, యాదవులు ఎక్కువగా మందు తాగుతారు అని అన్న మినిస్టర్.. దాని పర్యవసానం..!

ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాక మాట్లాడే మాటలు హుందాగా ఉండాలి. అది కాదని ఎలా పడితే అలా మాట్లాడితే దాని పర్యవసానం వేరేగా ఉంటుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేష్ మంత్రి ఓం ప్రకాష్ రాజ్ భర్ అలాంటి స్థితిలోనే ఉన్నారు. రాజ్ పుత్ లూ, యాదవులు ఎక్కువగా మందు తాగుతారని ఆయన చేసిన కామెంట్లకు వారికి కోపం వచ్చింది. మినిస్టర్ ఇంటిని చుట్టుముట్టి.. కోడిగుడ్లు, టమాటోలు విసిరారు.

వారణాసిలో ఉండగా ఓం ప్రకాష్ ఈ వ్యాఖ్యలు చేశారు. మద్యానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కువ మద్యాన్ని రాజ్ పుత్ లూ.. యాదవులే తాగుతున్నారని అన్నారు. ఇవే వ్యాఖ్యలు టీవీలో కూడా ప్రసారమయ్యాయి. దీంతో ఆగ్రహించిన ఆ సామాజిక వర్గానికి చెందిన యువకులు ఓం ప్రకాష్ ఇంటి మీదకు దాడి చేశాడు. గతంలో కూడా ఓం ప్రకాష్ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు.. మీకు ఎవరైనా మందు ఇస్తే తాగేయండి.. కానీ ఓటు మాత్రం తమ పార్టీకే వేయండి అని ఓం ప్రకాష్ అన్నాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఎక్కడిదాకా దారితీస్తుందోనని ఓం ప్రకాష్ వర్గం కూడా మాట్లాడుతోంది. దీనిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా స్పందించాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here