ఉప్పల్ లో ‘చంద్ర గ్రహణ నరబలి’ కేసును చేధించిన పోలీసులు.. అతడు ఎవరో కాదు..!

హైదరాబాద్ లోని ఉప్పల్ లో చంద్రగ్రహణం తర్వాతి రోజు చోటుచేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం అయింది. ఓ చంటిబిడ్డను అత్యంత దారుణంగా మూఢనమ్మకాలకు బలి ఇచ్చారు. ఈ చంద్ర గ్రహణ నరబలి కేసును పోలీసులు ఛేదించారు. తమకేమీ తెలీదని తన ఇంటి మీద ఎవరో బిడ్డ తలను పెట్టారని కథలు చెప్పిన ఇంటి యజమాని, క్యాబ్ డ్రైవర్ రాజశేఖరే ప్రధాన నిందితుడని పోలీసులు తేల్చారు.

రాజశేఖర్ భార్య శ్రీలత ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో, ఆమె ఆరోగ్యం మెరుగవ్వాలంటే నరబలి ఇవ్వాలని కొందరు మాంత్రికులు చెప్పారు. వేరే ఎవరైనా అయితే ఈ మాటలను పట్టించుకునే వాళ్ళు కాదేమో.. కానీ మూఢనమ్మకాలను ఎక్కువగా పాటించే రాజశేఖర్ ఆ మాటలను నమ్మి ఈ పని చేశాడు. పోలీసుల విచారణలో రాజశేఖర్ తన తప్పును ఒప్పుకున్నాడు. నరహరి ఇంట్లో అతని కుమారుడు రంజిత్, పూజారి సాయంతో పూజలు చేశామని చెప్పాడు. పాప మొండాన్ని ఏమి చేశారో అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. పాపను కరీంనగర్ జిల్లాలోని ఓ తండా నుంచి తీసుకు వచ్చినట్టు రాజశేఖర్ చెప్పాడట. అయితే ఆ పాపను అమ్మిన వాళ్ళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here