ప‌ర‌మేశ్వ‌రుడి రూపంలో పాకిస్తానీ మాజీ క్రికెట‌ర్ ఫొటో

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో సోష‌ల్ మీడియాలో పోస్ట్ అయిన ఓ ఫొటో ఆ దేశ రాజ‌కీయాల‌ను కుదిపేస్తోంది. భారీ ప్ర‌కంప‌న‌ల‌ను రేకెత్తించింది. ఆ దేశ పార్ల‌మెంట్‌లోనూ చ‌ర్చ‌కు దారి తీసింది. ఆ ఫొటో..మాజీ క్రికెట‌ర్, పాకిస్తాన్ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్‌ది. ఇమ్రాన్ ఖాన్‌ను ప‌ర‌మేశ్వ‌రుడిగా చిత్రీక‌రించిన ఫొటో అది.

మెడ‌లో నాగుపాము, చేతిలో త్రిశూలం, త‌ల‌పై అర్ధ చంద్రాకారం, నుదుటిపై మూడో క‌న్నుతో ఫొటోషాప్ ద్వారా ఇమ్రాన్ ఖాన్ చిత్రాన్ని మ‌హాశివుడిగా చిత్రీక‌రించారు. ఈ ఫొటో అక్క‌డ సంచ‌ల‌నం రేపింది. ఇమ్రాన్ ఖాన్‌ను ఇలా చిత్రీక‌రించ‌డం వ‌ల్ల హిందువుల మ‌నోభావాల‌ను కించ‌ప‌రిచిన‌ట్టుగా అవుతుందంటూ అక్క‌డి రాజ‌కీయ పార్టీలు చెల‌రేగుతున్నాయి.

ఇమ్రాన్‌ఖాన్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. ఈ ఫొటోకు సంబంధించిన ఓ జిరాక్స్ కాపీని తీసుకుని ఓ పార్ల‌మెంటేరియ‌న్‌..స‌భ‌లో ప్ర‌సంగించారు. పాకిస్తాన్‌లో ఈ ఏడాదే ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇమ్రాన్ ఖాన్‌ను అప్ర‌తిష్టపాలు చేయ‌డానికి ప్ర‌త్య‌ర్థులు దీన్ని రూపొందించార‌ని పీటీఐ నాయ‌కులు ఆరోపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here