మెరైన్స్.. పాము రక్తం తాగించారు.. ఎందుకంటే ట్రైనింగ్ అట..!

వివిధ దేశాలకు చెందిన సైనికులు అక్కడికి చేరుకున్నారు. థాయ్ లాండ్ దేశానికి చెందిన మెరైన్స్.. వివిధ దేశాలకు చెందిన మెరైన్స్ కు శిక్షణ ఇస్తున్నారు. అయితే అది అలాంటి ఇలాన్తీ శిక్షణ కాదు.. ఏది పడితే అది తినాలి.. ఏది ఇచ్చినా తాగాలని.. తేళ్ళను స్నాక్స్ లాగా భావించాలి.. పాము రక్తాన్ని తాగేయాలి.. ఆసియా లో జరిగే అతిపెద్ద సైనిక విన్యాసాలలో ఒకటిగా పేరొందిన కోబ్రా గోల్డ్ వార్ గేమ్స్‌లో ఇలా శిక్షణ ఇచ్చారు.

ఈ ఏడాది 37వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన అమెరికా, థాయ్‌లాండ్ సహా పలు దేశాల సైనికులకు స్థానిక ట్రైనర్లు పది రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతంలో చిక్కుకుపోయినప్పుడు మనుగడ కొనసాగించేలా సైనికులను తీర్చిదిద్దడమే ఈ శిక్షణ ఉద్దేశం.. దీంతో థాయ్‌లాండ్ నదీ తీర ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో విడిది చేసిన సైనిక బృందాలతో కఠినమైన పనులు చేయించారు. ఆహారం తీసుకునే ముందు సైనికులతో కోబ్రా రక్తం తాగించారు. తేళ్లను తినిపించారు. వాటిని తినే ముందు విషాన్ని ఎలా తీసేయాలన్నది ప్రాక్టికల్‌గా చూయించారు. అదేవిధంగా అడవులలో నీటి చెలమలను గుర్తించడం, తినడానికి అనువైన మొక్కలను ఎలా గుర్తించాలనే విషయంపై వారికి శిక్షణ ఇచ్చారు.

పాము రక్తాన్ని తాగిన ఓ అమెరికా మెరైన్ మాట్లాడుతూ.. పాము రక్తం అచ్చం చేపలాగే ఉందని.. ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పాడు. అలాగే చిన్న చిన్న కోతులను, సాలీడులను తినడం ఎలాగో కూడా చూపించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ మంది అమెరికా సైనికులు ఈ సైనిక విన్యాసాల్లో పాల్గొనడానికి వచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here