న‌డి ఆకాశంలో విమానంలో వ్యాపించిన పొగ‌

న్యూయార్క్‌: న‌డి ఆకాశంలో విమానంలో ద‌ట్ట‌మైన పొగ వ్యాపించిన ఘ‌ట‌న ప్ర‌యాణికుల‌ను తీవ్ర ఆందోళ‌న‌కు గురి చేసింది. దీంతో ఆ విమానాన్ని ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వ‌చ్చింది. అమెరికాలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అది. అట్లాంటా నుంచి 178 మంది ప్రయాణికులు, సిబ్బందితో లండ‌న్‌కు బ‌య‌లుదేరింది.

అట్లాంటా విమానాశ్ర‌యంలో టేకాఫ్ తీసుక‌న్న కొన్ని నిమిషాల‌కే విమానం రెండో ఇంజిన్ నుంచి పొగ వెలువ‌డింది. దీన్ని గ‌మ‌నించిన వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన పైలెట్.. విమానాన్ని వెన‌క్కి మ‌ళ్లించారు. అట్లాంటాలోనే ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. సాంకేతిక లోపం వ‌ల్లే ఇంజిన్ నుంచి పొగ వెలువ‌డింద‌ని గుర్తించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here