ఆమె అచ్చం ట్రంప్ లాగే ఉంది..!

ఈ ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులు ఉంటారని అంటూ ఉంటే చాలా మంది నమ్మరు. అదే కనిపిస్తే మాత్రం ఆశ్చర్యపోక తప్పదు. అచ్చం ట్రంప్ ను పోలిన వారే ఇంకొకరు ఉన్నారు. అయితే మగవాడు కాదు.. ఓ మహిళ..! ఆ మహిళ ముఖం అచ్చం ట్రంప మొఖం లాగే కనిపిస్తోంది. దాదాపు పోలికలు అన్నీ ఒకే లాగే ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా వైట్ హౌస్ లో ఉంటే.. ఆమె మాత్రం స్పెయిన్ లోని ఓ పొలంలో పనిచేస్తూ ఉంది. ఆమె ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ మహిళ పేరు డోలోరెస్ లీస్ ఆంటెలో.. స్పెయిన్ కు చెందిన ఓ రైతు. ఈ మధ్య ఆమె ఒక లోకల్ న్యూస్ పేపర్ లో కనిపించింది. ఆంటెలో ఫోటోను చూసిన కొందరు ఆమె అచ్చం ట్రంప్ లాగే ఉందని అనుకున్నారు. వెంటనే ఇంటర్వ్యూ చేసిన పత్రిక లా వోజ్ డి గలీషియాను సంప్రదించారు. ఆమె వివరాలను తెలుసుకున్నారు. వెంటనే ఆమెకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా.. నెటిజన్ల నుండి భారీగా స్పందన వచ్చింది. అంతేకాకుండా ఆమె స్థానికంగా సెలెబ్రిటీ అయిపోయారు. ‘డొనాల్డ్ ట్రంప్ ఆఫ్ కోస్టా డ మోర్టే’ గా ఆమెను పిలుస్తున్నారు. రాత్రికి రాత్రే ఆమె బాగా పాపులర్ అయిపోయింది. ఈ విషయం ఆమె తెలుసుకొని ఆశ్చర్య పోయింది. తన ఫోటో చాలా దూరమే వెళ్ళిపోయిందని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తన వెంట్రుకల రంగు.. ట్రంప్ వెంట్రుకల రంగు ఒకేలా ఉండడంతోనే ఆయనతో పోలుస్తున్నారని ఆమె చెప్పుకొచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here