అమెరికాను గ‌డ్డ‌క‌ట్టించిన చ‌లి తీవ్ర‌త‌కు అద్దం ప‌ట్టే ఫొటో ఇది..!

చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేని చ‌లి దెబ్బ‌కు అమెరికా గ‌డ్డ‌క‌ట్టుకు పోయింది. బాంబ్ సైక్లోన్ ప్ర‌భావానికి సగం అమెరికా మంచులో కూరుకుపోయింది. ఉష్ణోగ్రత కొన్ని రోజుల నుంచీ మైనస్ డిగ్రీల్లోనే ఉంటోంది.

దీని ప్ర‌భావంతో న్యూయార్క్‌, నార్త్ క‌రోలినా, మాసాచుసెట్స్‌, బోస్ట‌న్‌, మ‌న్‌హ‌ట్ట‌న్, మాంట్రియ‌ల్‌, వ‌ర్జీనియా, ఫిల‌డెల్ఫియా, చికాగో వంటి న‌గ‌రాలు మంచులో మునిగాయి.

అక్క‌డి చెరువులు, న‌దుల్లో జ‌లాలు గ‌డ్డ‌క‌ట్టుకుపోయి, మంచు దిమ్మెలుగా త‌యార‌య్యాయి. ఈ ప‌రిస్థితుల్లో జ‌ల‌చ‌రాల ప‌రిస్థితేమిట‌నే ప్ర‌శ్న త‌లెత్తుతోంది.

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మే ఈ పిక్స్‌. నార్త్ క‌రోలినా ష‌ల్లోట్టె రివ‌ర్ స్వాంప్ పార్క్‌లో తీసిన పిక్స్ ఇవి. చ‌లి దెబ్బ‌కు ఈ పార్క్‌లో ఉన్న ఓ స‌ర‌స్సు గ‌డ్డ‌క‌ట్టుకుయింది.

వెచ్చ‌ద‌నం కోసం జ‌ల‌చ‌రాలు పడ‌రాని పాట్లు ప‌డుతున్నాయి. చాలా రోజుల త‌రువాత ఆదివారం ఎండ కాయ‌డంతో ఈ పార్క్‌లో గ‌డ్డ‌క‌ట్టుకుపోయిన ఓ స‌ర‌స్సు నుంచి వెచ్చ‌ద‌నం కోసం మొస‌ళ్లు ఇలా త‌న ముక్కు, నోటి భాగాన్ని ఇలా పైకి పెట్టింది.

ఎండ నుంచి వెచ్చ‌ద‌నాన్ని తీసుకుంది. మంచు ఫ‌ల‌కాల‌ను బ‌ద్ద‌లుకొట్టుకుని వ‌చ్చి మ‌రీ.. ఇలా వెచ్చ‌ద‌నాన్ని పొందాయి. దీనికి సంబంధించిన ఓ వీడియోను ష‌ల్లెట్టె రివ‌ర్ స్వాంప్ పార్క్ అధికారులు సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

Alligators in Ice!

Survival machines! The American Alligator in ice.#northcarolinaaquarium #newhanovercountyschools#brunswickcountyschools #alligators #oib #oibswamppark #visitnc #visitmyrtlebeach #winter2018 #wilmingtonnc#natgeo Brunswick County, North Carolina

Shallotte River Swamp Parkさんの投稿 2018年1月5日(金)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here