త‌ల్లికి పాముకాటు..పాలు తాగి బిడ్డ కూడా!

పాము కాటుకు గురైన ఓ తల్లి తన రెండున్నరేళ్ల పాపకు చ‌నుబాలివ్వ‌గా విష ప్ర‌భావానికి గురై ఆ చిన్నారి మరణించిన విషాదరకర ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లా మాండ్ల గ్రామంలో చోటు చేసుకుంది. పాము విషం కారణంగా కొద్దిసేపటికే ఆ తల్లి కూడా మరణించింది.

గురువారం రాత్రి మాండ్ల గ్రామానికి చెందిన ఓ మహిళ తన ఇంట్లో నిద్రపోతుండగా పాము కాటు వేసింది. వెంట‌నే ఆమె దాన్ని గుర్తించ‌లేక‌పోయింది. పాప ఏడుస్తోంటే చ‌నుబాలు ఇచ్చింది. ఆ పాలు తాగిన కొద్దిసేపటికే తల్లీ బిడ్డల పరిస్థితి విషమించడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. వెంటనే వైద్యం ప్రారంభించినా, పాప దక్కలేదు. విషం పూర్తిగా శరీరానికి ఎక్కడంతో ఆ తల్లి కూడా కొద్దిసేపటికి మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here