త‌మ రాష్ట్రానికి మ‌హేష్ బాబు వ‌చ్చాడ‌ని తెలుసుకుని.. స్వ‌యంగా ముఖ్య‌మంత్రే..!

సూపర్‌స్టార్ మహేష్‌బాబు 25వ సినిమా షూటింగ్ ఉత్త‌రాఖండ్ రాజ‌ధాని డెహ్రాడూన్‌లో లాంఛ‌నంగా ఆరంభ‌మైంది. షూటింగ్ జ‌రుగుతున్న విష‌యాన్ని తెలుసుకున్న ఉత్త‌రాఖండ్ ముఖ్య‌మంత్రి త్రివేంద్ర సింగ్ రావ‌త్‌.. స్వ‌యంగా షూటింగ్ స్పాట్‌కు వ‌చ్చారు. మ‌హేష్‌బాబు గురించి తాను విన్నాన‌ని, ముఖ్య‌మంత్రిగా న‌టించిన `భ‌ర‌త్ అనే నేను..`లోని కొన్ని స‌న్నివేశాల‌ను చూశాన‌ని, అవి త‌న‌కు నచ్చాయ‌ని త్రివేంద్ర సింగ్ కితాబిచ్చారు. కొద్దిసేపు మ‌హేష్‌తో ముచ్చ‌టించారు.

 

యూనిట్‌ను ప‌ల‌క‌రించారు. తన సినిమా షూటింగ్ జ‌రుగుతున్న విష‌యాన్ని తెలుసుకుని స్వ‌యంగా ఓ రాష్ట్ర ముఖ్య‌మంత్రే స్పాట్‌కు రావ‌డం ప‌ట్ల మ‌హేష్ స‌హా చిత్రం యూనిట్ షాక్‌కు గురైంది. ఈ సంద‌ర్భంగా మ‌హేష్‌బాబు ఆయ‌న‌కు సాద‌రంగా ఆహ్వానించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వ‌హిస్తోన్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ డెహ్రాడూన్‌లో మొద‌లైంది. ఈ సినిమాలో మ‌హేష్ న్యూ లుక్‌తో క‌నిపించ‌బోతున్నారు. దీనికోసం ఆయ‌న గెడ్డం, మీసం పెంచుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here