‘వచ్చాడయ్యో.. సామి’ అంటూ వచ్చేసిన ముఖ్యమంత్రి..!

మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా ఆడియో ఇప్పటికే భారీ హిట్ అయింది. సినిమా మీద అంచనాలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ శుక్రవారం కోసం తెలుగు సినిమా అభిమానులు ఎంతగానో వెయిటింగ్. అందుకే సినిమా ప్రోమోలతో ఆడియన్స్ లో భీభత్సమైన హైప్ ను తీసుకొని వెళుతున్నారు. తాజాగా ‘వచ్చాడయ్యో సామి’ పాటకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. పంచకట్టుతో మహేష్ బాబు అలరిస్తున్నాడు.

” వచ్చాడయ్యో సామి ” అంటూ సాగే ఈ పాటని తెలుగు వారికి సుపరిచితుడైన ఉత్తరాది నేపథ్యగాయకుడు కైలాష్ ఖేర్, దివ్య కుమార్ పాడారు. దేవి శ్రీ ప్రసాద్ కంపోజిషన్‌లో రూపొందిన ఈ పాట సంగీత ప్రియుల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. మహేష్ బాబు పంచెకట్టులో కనిపించడం ఈ పాటపై క్రేజ్ పెరగడానికి మరో కారణమైంది. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఏప్రిల్ 20వ తేదీన ఆడియెన్స్ ముందుకు రానుంది. మహేష్ బాబు సరసన కైరా అద్వానీ జంటగా నటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here