ప్ర‌యాణికుల‌తో నిండుగా క‌దిలింది..చెరుకుతోట‌లో ప‌ల్టీ కొట్టింది!

సామ‌ర్థ్యానికి మించి ప్ర‌యాణికుల‌ను ఎక్కించుకుని వేగంగా వెళ్తూ.. అదుపు త‌ప్పిందో వ్యాన్‌. రోడ్డు ప‌క్క‌న ప‌ద‌డుగుల మేర ఏట‌వాలుగా ఉన్న ప్రాంతంలోకి దూసుకెళ్లింది. అక్క‌డే ఉన్న చెరుకుతోట‌లో ప‌ల్టీ కొట్టింది.

ఈ ప్ర‌మాదంలో వ్యాన్‌లో ప్ర‌యాణిస్తున్న ఏడుమందికి గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని మండ్య‌జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కేఆర్ పేటే నుంచి స‌మీప గ్రామాల‌కు ప్ర‌యాణికుల‌ను చేర‌వేసే మ‌హీంద్రా మ్యాగ్జిమ్ వ్యాన్ అది.

గురువారం సాయంత్రం సామ‌ర్థ్యానికి మించి ప్ర‌యాణికులు అందులో ఎక్కారు. కేఆర్ పేటే నుంచి బ‌య‌లుదేరిన ఈ వ్యాన్ ప‌ట్ట‌ణ శివార్ల‌లోకి రాగానే మ‌లుపు వ‌ద్ద అదుపు త‌ప్పింది.

రోడ్డు ప‌క్క‌కు దూసుకెళ్లింది. అదే వేగంతో చెరుకుతోట‌లో ప‌ల్టీ కొట్టింది. ప్ర‌మాద స‌మ‌యంలో వ్యాన్‌లో 12 మంది వ‌రకు ఉన్న‌ట్లు ప్ర‌త్య‌క్ష‌సాక్షులు చెబుతున్నారు.

వారిలో ఏడుమంది గాయ‌ప‌డ్డారు. వారిని స‌మీప ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఎవ‌రికీ ప్రాణాపాయం లేద‌ని డాక్ట‌ర్లు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేఆర్ పేటే పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here