క‌న్నత‌ల్లి మృత‌దేహాన్ని అయిదు నెల‌ల పాటు వంతుల వారీగా!

తండ్రి మ‌ర‌ణించ‌డం ద్వారా త‌ల్లికి అందుతోన్న పింఛ‌న్ సొమ్ము కోసం అయిదుమంది కుమారులు అమానుష చ‌ర్య‌కు పాల్ప‌డ్డాడు. త‌న త‌ల్లి మ‌ర‌ణించింద‌నే విష‌యం తెలిస్తే, అధికారులు పింఛ‌న్ మొత్తాన్ని ఆపేస్తార‌ని భ‌య‌ప‌డ్డాడు. త‌ల్లి మ‌ర‌ణించిన విష‌యాన్ని బ‌య‌టికి పొక్క‌నివ్వ‌లేదు. అయిదు నెల‌ల పాటు ఆమె మృత‌దేహాన్ని ఇంట్లోనే ఉంచుకున్నారు.

క‌ర్మ‌కాండ‌ల‌ను చేయ‌లేదు. ఇళ్లు మొత్తం దుర్వాస‌న‌తో నిండిపోయిన‌ప్ప‌టికీ.. చ‌లించ‌లేద‌త‌ను. ఈ ఆట‌విక ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని వార‌ణాశిలో చోటు చేసుకుంది. పితృదేవ‌త‌ల అనుగ్ర‌హాన్ని పొంద‌డానికి ఏ పుణ్య ప్ర‌దేశానికి వెళ్తామో.. అదే చోట ఈ ఘ‌ట‌న న‌మోదైంది.

వార‌ణాశిలో దుర్గాకుండ్ స‌మీపంలోని వికాస్ కాల‌నీలో నివ‌సించే అమ‌రావ‌తి దేవి. వ‌య‌స్సు 70 సంవ‌త్స‌రాలు. ఈ ఏడాది జ‌న‌వ‌రి 13వ తేదీన ఆమె ఇంట్లో మ‌ర‌ణించారు. ఆమె భ‌ర్త ద‌యాశంక‌ర్ కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగి. క‌స్ట‌మ్స్ విభాగంలో సూప‌ర్‌వైజ‌ర్‌గా ప‌నిచేశారు. చాలాకాలం కింద‌టే ద‌యాశంక‌ర్ చ‌నిపోయారు.

ఆయ‌న చ‌నిపోగా.. అమ‌రావ‌తి దేవికి ప్ర‌తినెలా 40 వేల రూపాయ‌ల పింఛ‌న్ అందుతుండేది. ఈ ఏడాది జ‌న‌వ‌రి 13న అమ‌రావ‌తి దేవి చ‌నిపోయారు. ఆమె చ‌నిపోయిన విష‌యం తెలిస్తే.. పింఛ‌న్ ఆగిపోతుంద‌నే ఉద్దేశంతో అయిదుమంది కుమారులు ర‌విప్ర‌కాశ్‌, దేవ్ ప్ర‌కాశ్‌, యోగేశ్వ‌ర్ ప్ర‌కాశ్‌, జ్యోతి ప్ర‌కాశ్, శివ్ ప్ర‌కాశ్‌ఈ విష‌యాన్ని బ‌య‌టికి తెలియ‌నివ్వ‌లేదు.

మృత‌దేహాన్ని ఇంట్లోనే ఉంచాల‌ని నిర్ణ‌యించారు. దీనికి- వారి భార్య‌లు కూడా స‌రేనంటూ త‌లూపారు. దీనితో జ‌న‌వ‌రి 13వ తేదీన అమ‌రావ‌తి దేవి మ‌ర‌ణించ‌గా.. ఆ విష‌యాన్ని దాచి పెట్టారు. బాహ్య ప్ర‌పంచానికి తెలియ‌నివ్వ‌లేదు. త‌ల్లి పేరు మీద వ‌చ్చే 40 వేల రూపాయ‌ల పింఛ‌న్‌ను ప్ర‌తినెలా క్ర‌మం తప్ప‌కుండా అందుకునే వారు. దీనికోసం వంతులు వేసుకున్నారు.

అమ‌రావ‌తి దేవి ఇంట్లో నుంచి దుర్వాస‌న వ‌స్తుండ‌టం, ఆమె కుమారుల ప్ర‌వ‌ర్త‌న అనుమానాస్ప‌దంగా ఉండ‌టం, త‌ల్లి క‌నిపించ‌క‌పోవ‌డం.. వంటి అనుమానాలు స్థానికుల‌కు త‌లెత్తాయి. దీనితో వారు భేలూపూర్ పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు అమరావ‌తి దేవి మృత‌దేహాన్ని చూసి, షాక్ అయ్యారు. చ‌లించిపోయారు. మృత‌దేహం ఉన్న తీరును చూసి క‌న్నీరు పెట్టుకున్నారు. మృత‌దేహాన్ని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కుమారుల‌పై కేసు న‌మోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here