ఈమె పేరు వెంకటలక్ష్మి.. హోంగార్డుగా పనిచేస్తున్న వ్యక్తిని ప్రేమించకపోవడమే చేసిన నేరం..!

ఈ ఫోటోలో మీరు చూస్తున్న అమ్మాయి పేరు వెంకటలక్ష్మి.. ఆమెను అత్యంత కిరాతకంగా చంపేశాడు ఓ వ్యక్తి. ఇందుకు ఆమె చేసిన తప్పు ఏమిటో తెలుసా..? ప్రేమిస్తున్నానని వెంటబడుతున్న హోమ్ గార్డుకు ఆమె నో చెప్పడమే.. దీంతో అతడు ఆమె షాప్ లో ఉండగా అతి దారుణంగా గొంతుకోసి చంపేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని యూసఫ్ గూడలో చోటుచేసుకుంది.

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు వెంకటలక్ష్మి, తన తల్లిదండ్రులతో కలసి నగరంలో నివసిస్తూ స్థానికంగా ఉన్న వన్ గ్రామ్ గోల్డ్ జ్యూయెలరీ షాప్ లో పనిచేస్తోంది. గత కొంత కాలంగా, ఓ జిల్లా ఎస్పీ వద్ద డ్రైవర్‌ గా విధులు నిర్వహిస్తున్న సాగర్ అనే హోంగార్డు, ఆమెను ప్రేమించాలని వేధిస్తున్నాడు. ఈ క్రమంలో షాప్ లో వెంకటలక్ష్మి ఒంటరిగా ఉండగా.. అక్కడికి వచ్చిన సాగర్, తనను వివాహం చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి తేవడంతో పాటు, ఆమె గొంతుకోసి దారుణంగా హతమార్చాడు.

ఈ ఘటన సాయంత్రం 5.15 గంటలకు జరిగింది. హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. హత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిసేపటి ముందు, షాపు వద్ద అనుమానాస్పదంగా ఎవరో తిరుగుతున్నారని వెంకటలక్ష్మి యజమానికి చెప్పడంతో, ఆయన అప్రమత్తమై తన స్నేహితుడికి, వెంకటలక్ష్మి తండ్రికి సమాచారాన్ని ఇచ్చాడు. వారు వచ్చి చూసేసరికే ఆమె రక్తపు మడుగులో పడి ప్రాణాలు కోల్పోయింది. పశ్చిమ మండలం టాస్క్‌ ఫోర్స్‌ పోలీసుల ఎదుట సాగర్ లొంగిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here