అజ్ఞాతవాసి విషయంలో షాకింగ్ నిర్ణయం.. తీసేసిన.. కలిపిన కొత్త సీన్లు ఏవంటే..!

అజ్ఞాతవాసి సినిమాకు మిశ్రమ స్పందన వస్తున్నా కలెక్షన్లకు మాత్రం ఏ విధమైన ఇబ్బంది లేదు. ఇప్పటిదాకా హౌస్ ఫుల్ కలెక్షన్లతోనే నడుస్తున్నాయి. పండగ సీజన్ ను అద్భుతంగా క్యాష్ చేసుకోవడంలో మాత్రం అజ్ఞాతవాసి సక్సెస్ అయ్యాడు. అయితే సినిమా రన్ టైమ్ ఎక్కువ అయిందని.. అలాగే కొన్ని వేస్ట్ సీన్లు ఉన్నాయని అంటూ ఉన్నారు. అయితే ఈ విషయంపై చిత్ర బృందం దృష్టి సారించింది.

సినిమాలో ఉన్న అనవసరమైన సీన్లను తీసేశారు. అలాగే వెంకటేష్ చేసిన ఫైట్.. అలాగే కొన్ని సీన్లను కలపనున్నారు. సినిమాలో 12 నిమిషాల వరకు తీశారట. ఇక ఎక్కువగా బోర్ కొట్టకుండా బాగా ఉండే సీన్లను ఓ 7 నిమిషాల 26 సెకన్ల వరకు యాడ్ చేశారట. అందులోనే వెంకటేష్ – పవన్ సీన్ కూడా ఉందని టాక్. ఈ సీన్ లో పవన్ కళ్యాణ్-వెంకటేష్ తో కలిసి చేసే ఫైట్ సీన్ అందరినీ అలరిస్తుందని చెప్పకనే చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న కలెక్షన్లను మరింతగా పెంచుకోడానికి చిత్ర నిర్మాత చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here