నవరస నటసార్వభౌముడికి ఎన్టీఆర్ లో కీల‌క పాత్ర‌

విశ్వ‌విఖ్యాత న‌టసార్వ‌భౌముడిగా అంద‌రికి సుప‌రిచ‌త‌మైన పేరు ఎన్టీఆర్. ఆయ‌న జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న చిత్రంలో న‌వ‌ర‌స‌న‌ట సార్వ‌భౌముడైన కైకాల స‌త్య‌నారాయ‌ణ‌కు ముఖ్య‌మైన పాత్ర ల‌భించింది. యన్.టి.ఆర్ బయోపిక్ మొదటి షెడ్యూల్ నిన్నటితో పూర్తయింది. .. ఈ చిత్రంలో సత్యనారాయణ ప్రఖ్యాత చిత్ర నిర్మాత, తెలుగు సినిమా పితామహుడు అయిన హెచ్.ఎం.రెడ్డి పాత్రను పోషిస్తున్నారు. తన నటనతో వందలాది చిత్రాల్లోని పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసిన కైకాల సత్యనారాయణ యన్.టి.ఆర్ బయోపిక్ లో హెచ్.ఎం.రెడ్డిగా అద్భుతంగా నటించారని ఆ చిత్ర ద‌ర్శ‌కుడు క్రిష్ తెలిపారు.

ఆ మహానుభావుడి పాత్రను ఈ మహానటుడు అమోఘమైన పద్ధతిలో రంజింపజేశారని ఆయ‌న ఆనందం వ్య‌క్తం చేశారు. సత్యనారాయణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని సినిమాలో ఆయన లుక్ ను నేడు విడుదల చేయడం ప‌ట్ల ఆ చిత్ర బృందం హ‌ర్షం వ్య‌క్తం చేసింది. ఎన్.బి.కె స్టూడియోస్ పతాకంపై నందమూరి బాలకృష్ణ నిర్మిస్తూ టైటిల్ రోల్ పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని సాయికొర్రపాటి, విష్ణు ఇందూరు సమర్పిస్తున్నారు.

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, నరేష్ వి.కె, మురళీశర్మ, ప్రకాష్ రాజ్ తదితరులు..

సాంకేతిక బృందం: దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి, నిర్మాతలు: నందమూరి బాలకృష్ణ, విష్ణువర్ధన్ ఇందూరి, సాయి కొర్రపాటి-ఎం.ఆర్.వి.ప్రసాద్, బ్యానర్లు: ఎన్.బి.కె ఫిలిమ్స్-విబ్రా మీడియా-వారాహి చలనచిత్రం , సంగీతం: ఎం. ఎం. కీరవాణి, సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్ వి.ఎస్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here