`ఆమె మ‌హాన‌టే కాదు..మ‌హా మొండి కూడా! జెమిని మామ‌ది త‌ప్పులేదు, త‌ప్పంతా సావిత్రి అత్త‌దే!`

న‌టి సావిత్రి బ‌యోపిక్ `మ‌హాన‌టి` మీద ఎన్ని ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయో.. అన్ని విమ‌ర్శ‌లు కూడా ఇప్పుడిప్పుడే బ‌హిర్గ‌త‌మౌతున‌నాయి. సావిత్రిని ద‌గ్గ‌రి నుంచి చూసిన‌, ఆమెతో సాన్నిహిత్యం ఉన్న అల‌నాటి న‌టులు ఒక్క‌రొక్క‌రుగా మ‌హాన‌టిని ప్ర‌శంసిస్తూనే, విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

మొన్న‌టికి మొన్న – జెమిని గ‌ణేశన్ కుమార్తె ఆ సినిమాపై విమ‌ర్శ‌లు చేశారు. త‌న తండ్రి పాత్ర‌ను తాగుబోతుగా చిత్రీక‌రించార‌ని మండిప‌డ్డారు. ఇప్పుడు ఇదే జాబితాలో సీనియ‌ర్ న‌టి ర‌మాప్ర‌భ కూడా చేరారు. మ‌న‌కు తెలియ‌ని విష‌యం ఏమిటంటే- ర‌మాప్ర‌భకు సావిత్రి వ‌రుస‌కు మేన‌త్త అవుతారు. ఆ చ‌నువుతోనే ఆమె ఆ సినిమాపై కొన్ని విమ‌ర్శ‌లు చేశారు.

 

సావిత్రి వంటి మొండి మ‌నిషిని ఇప్ప‌టిదాకా కూడా తాను జీవితంలో ఎప్పుడూ చూడ‌లేద‌ని ర‌మాప్ర‌భ చెబుతున్నారు. ఓ వెబ్‌సైట్‌కు ఆమె ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె కామెంట్స్ చేశారు. సావిత్రి జీవితాన్ని నాశ‌నం చేసింది ఆ మొండిత‌న‌మేన‌ని అన్నారు.

సావిత్రి జీవిత క‌థ విషాద‌క‌రంగా ముగియ‌డంలో జెమినీ గ‌ణేశ‌న్ మామ‌ది త‌ప్పు లేద‌ని, త‌ప్పంతా సావిత్రి అత్త‌దేన‌ని అన్నారు. ఆమె త‌న మొండితనం వ‌ల్లే అంద‌ర్నీ దూరం చేసుకున్నార‌ని చెప్పారు. మంచచినా, చెడు అయినా సావిత్రి ఒక్క‌సారి నిర్ణ‌యం తీసుకుంటే.. ఇక అందులో తిరుగు ఉండ‌ద‌ని అన్నారు. అలా త‌ప్ప‌ని చెప్పిన వారిపై ఆగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శించేవారని చెప్పారు.

 

జెమిని మామ ఇంటికి వ‌స్తే.. సావిత్రి అత్త కుక్క‌ల్ని ఉసిగొల్పార‌ని, దీనితో మామ గోడ‌దూకి మ‌రీ పారిపోయార‌ని, దీనికి తానే ప్ర‌త్య‌క్ష‌సాక్షిన‌ని ర‌మాప్ర‌భ కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. మ‌హాన‌టి సినిమాలో సావిత్రి పెద‌నాన్న కేవీ చౌద‌రి పాత్ర‌ను చాలా ఉదాత్త‌మైన‌దిగా, అత‌ను చాలా మంచివాడిగా చూపించార‌ని, అది స‌రి కాద‌ని చెప్పారు.

కేవీ చౌద‌రికి తాను స్వ‌యంగా మ‌న‌వ‌రాలిన‌ని, ఆయ‌న వ్య‌క్తిత్వం అంత మంచిది కాద‌ని అన్నారు. నిజానికి సావిత్రిని మద్యానికి బానిసగా చేసిన వ్యక్తి త‌న తాత (కేవీ చౌద‌రి) అని చెప్పుకొచ్చారు. మహానటి సినిమాలో దాదాపు 70శాతం అన్నీ తప్పులే ఉన్నాయంటున్నారామె. సావిత్రితో దాదాపు పదేళ్ల పాటు అత్యంత సన్నిహితంగా గ‌డిపాన‌ని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here