మొన్న‌టిత‌రం క‌ల‌ల‌రాణి కృష్ణ‌కుమారి కన్నుమూత‌

అలనాటి ప్రముఖ నటి కృష్ణకుమారి కన్నుమూశారు. బెంగళూరులోని నివాసంలో బుధ‌వారం ఉద‌యం ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె వ‌య‌స్సు 85 సంవ‌త్స‌రాలు.

ఆమెకు కుమార్తె ఉన్నారు. ప్ర‌స్తుతం బెంగ‌ళూరులో కుమార్తె ఇంట్లోనే ఉంటున్నారు. 1951లో ఆమె తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టారు. `నవ్వితే నవరత్నాలు` మొద‌టి చిత్రం.

ఎన్టీఆర్‌, ఎఎన్ఆర్, కృష్ణ‌, శోభ‌న్‌బాబు, కృష్ణంరాజు.. ఇలా తొలిత‌రం న‌టులంద‌రితోనూ ఆమె న‌టించారు. పల్లెపడుచు, పాతాళభైరవి, బంగారు పాప చిత్రాలతో కృష్ణకుమారి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

దేవాంతకుడు, భార్యాభర్తలు, కులగోత్రాలు, ఇలవేల్పు, వినాయక చవితి, వీర కంకణం, పెళ్లి కానుక, నిత్యకల్యాణం పచ్చ తోరణం, వాగ్దానం, లక్షాధికారి, పునర్జన్మ వంటి హిట్ చిత్రాలతోపాటు కన్నడ, తమిళ, మలయాళ చిత్రాల్లోనూ నటించారు. మూడుసార్లు ఆమె ఉత్త‌మ న‌టి అవార్డును అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here