పోలీసుల ఎదుట‌, యువ‌కుడిని క‌సిదీరా కొట్టింది..ఉతికి ఆరేసింది! కార‌ణం తెలిస్తే షాక్‌!

ఇండోర్‌: కోర్టు ఆవ‌ర‌ణ‌లో, పోలీసుల ఎదుటే ఓ మ‌హిళ ఓ యువ‌కుడిని ఉతికి ఆరేసింది. చేతులు నొప్పి పుట్టేంత వ‌ర‌కూ కొడుతూనే ఉంది. పోలీసులు కూడా ఆమెను ఆపే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. ఇంకా కొట్ట‌మ‌న్న‌ట్టుగా చూశారు. దీనికి కార‌ణం.. ఆ మ‌హిళ అత్యాచార బాధితురాలి త‌ల్లి. ఆమె చేతిలో దెబ్బ‌లు తింటోన్న‌ది అత్యాచార నిందితుడు.

ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్‌లో చోటు చేసుకుంది. అర్బాజ్ (పేరుమార్చాం) అనే ఆ యువ‌కుడు అత్యాచార నిందితుడు. ఓ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు.

బాధితురాలి త‌ల్లి ముంతాజ్ (పేరుమార్చాం) ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుణ్ని అరెస్టు చేశారు. కోర్టులో ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా బేడీలు వేసి, పోలీసుల ఆధీనంలో ఉన్న నిందితుడిని అత్యాచార బాధితురాలి త‌ల్లి ఉతికేసింది. ఆ కిరాత‌కుడి చెంప‌లు వాయించేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here