ప‌ర్షియ‌న్ గ‌ల్ఫ్ స‌ముద్ర తీరానికి కొట్టుకొచ్చిన ల‌క్ష‌లాది చేప‌లు..నిర్జీవంగా!

అబుధాబి: ప‌ర్షియ‌న్ గ‌ల్ఫ్ స‌ముద్ర తీరానికి రెండురోజులుగా ల‌క్ష‌లాది చేప‌లు నిర్జీవంగా కొట్టుకొస్తున్నాయి. 48 గంట‌ల వ్య‌వ‌ధిలో గ్యాప్ అనేదే లేకుండా అల‌ల‌తో పాటు తీరానికి కొట్టుకొచ్చాయి. యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌లోని ర‌స్ అల్‌ఖైమాలో తీర ప్రాంత న‌గ‌రం అల్‌ర‌మ్స్‌లో ఈ దృశ్యం క‌నిపించింది. ఒక‌టిన్న‌ర కిలోమీట‌ర్ దూరం వ‌ర‌కూ ఎటు చూసిన మృత చేప‌లే క‌నిపిస్తున్నాయి.

ఈ చేప‌ల‌ను స్థానికంగా ఓవుమా అని పిలుస్తారు. దాని సాంకేతిక నామం సార్డైన్‌. ఈ ఘ‌ట‌న‌పై ర‌స్ అల్‌ఖైమా ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ విభాగం అధికారులు విచార‌ణ చేప‌ట్టారు. సార్డైన్ చేప‌లు అమ్ముడు పోక‌పోవ‌డం వ‌ల్ల మ‌త్స్య‌కారులు వాటిని పార‌బోసి ఉంటార‌నే అనుమానాలు వ్య‌క్తమౌతున్నాయి. అధికారులు మాత్రం దీన్ని ధృవీక‌రించ‌లేక‌పోతున్నారు. సార్డైన్ చేప‌లకు మంచి డిమాండ్ ఉంద‌ట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here