చెక్‌పోస్ట్ గేటును మినీ లారీ ఢీ కొట్టి..ఆ గేటు వెళ్లి..!

మ‌డికెరి: అదుపు త‌ప్పిన వేగంతో వ‌చ్చిన ఓ మినీ లారీ చెక్‌పోస్ట్ గేటును ఢీ కొట్టింది. అదే గేటు ఓ ఉద్యోగినీ గాయ‌ప‌రిచింది. ఇనుప గేటుకు, ప‌క్క‌నే పార్క్ చేసి ఉంచిన కారుకు మ‌ధ్య న‌లిగిపోయారాయ‌న‌. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని కొడ‌గు జిల్లా సంపజె చెక్‌పోస్ట్ వ‌ద్ద చోటు చేసుకుంది.

మంగ‌ళూరు, ద‌క్షిణ క‌న్న‌డ జిల్లాల‌ను అనుసంధానించే రోడ్డు ఇది. వ‌న్య‌ప్రాణుల అక్ర‌మ ర‌వాణాను అరిక‌ట్ట‌డానికి అట‌వీశాఖ ఈ చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేసింది. ఈ నెల 6వ తేదీన ఉద‌యం రాజ‌ప్ప అనే ఉద్యోగి విధుల్లో ఉన్నారు. అదే మార్గంలో దూసుకొచ్చిందో మినీ లారీ. మితిమీరిన వేగానికి అదుపు త‌ప్పింది. చెక్‌పోస్ట్ గేటును ఢీ కొట్టింది.

గేటు వేసి ఉన్న‌ప్ప‌టికీ.. ఆగ‌కుండా వ‌స్తోన్న మినీ లారీని చూసిన రాజ‌ప్ప గేటుకు దూరంగా ప‌రుగెత్తారు. అప్ప‌టికే ఆల‌స్య‌మైంది. లారీ గేటును బ‌లంగా ఢీ కొట్టింది. లారీ ఢీ కొట్టిన వేగానికి గేటు బ‌లంగా రాజ‌ప్ప‌ను తాకింది. గేటుకు ఒక‌వైపు పార్క్ చేసి ఉంచిన కారు, గేటు మ‌ధ్య న‌లిగిపోయారాయ‌న‌.

వెంట‌నే ఆయ‌న‌ను మడికెరి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. దీనికి సంబంధించిన దృశ్యాల‌న్నీ అక్క‌డ అమ‌ర్చిన సీసీకెమెరాల్లో రికార్డ‌య్యాయి. లారీ బ్రేకులు ఫెయిల్ కావ‌డం వ‌ల్లే ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని చెబుతున్న‌ప్ప‌టికీ.. గేటు దాటిన వెంట‌నే లారీ ఆగిపోవ‌డం ఈ వీడియోలో క‌నిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here