శ్రీదేవి మళ్ళీ ఈ చిన్నారిలా పుట్టిందట.. తెలివితక్కువ వాళ్ళను చేసి ఆడుకుంటున్నారు..!

యుట్యూబ్ లో ట్రెండింగ్ న్యూస్ చూస్తే.. అందులో ఈ చిన్నారి ఫోటో పక్కన.. శ్రీదేవిని పెట్టి.. ఆమె మళ్ళీ జన్మించింది అంటూ పోస్టులు.. దానికి లక్షల సంఖ్యలో వ్యూస్..! అచ్చం శ్రీదేవిలాగే పుట్టిన పాప అంటూ పలు వీడియోలు ఈ చిన్నారి గురించి వెలిశాయి. ఏ మాత్రం లాజిక్ లేని వీడియో ఇది.. దాన్ని లక్షల మంది చూస్తూ ఉన్నారు.

తెలివితక్కువ వాళ్ళను చేసి ఆడుకోడానికే ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. మన వాళ్ళు హెడ్డింగ్ చూడడం.. దానిని మనవాళ్ళు క్లిక్కుల మీద క్లిక్కులు ఇవ్వడం. శ్రీదేవి చనిపోయిందన్న బాధలో ఆమె అభిమానులు ఉంటే.. అచ్చం ఆమె పోలికలతో ఓ అమ్మాయి పుట్టిందని.. ఆమె శ్రీదేవిలాగే ఉందని చెప్పారు. ఓ చిన్న పాప వీడియోను అప్లోడ్ చేశారు కూడానూ..!

అయితే ఇది చాలా పాత వీడియో.. కొన్ని నెలల క్రితమే వాట్సప్ లలో వైరల్ అవుతూ వస్తోంది. కానీ పరిస్థితిని చూసుకొని నెటిజన్లతో ఆడుకోడానికి ఇలాంటి వీడియోలను పుట్టిస్తూ వస్తూ ఉంటారు కొందరు మీడియా ప్రతినిధులు. అలాంటిదే ఇది కూడా..! వాళ్ళు చూస్తూనే ఉంటారు కదా అని ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటారు. వారి హెడ్డింగ్ లను చూసి మోసపోయి.. దాన్ని క్లిక్ చేసి అలాంటి వారిని ఎంకరేజ్ చేయకపోవడమే మనకు మంచిది. ఏది ఏమైనా దీనిని ఓ టీవీ ఛానల్ ప్రసారం కూడా చేసిందట. ఇది చాలా పాత వీడియో 2017లోనే దీన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here