డాట్ బాల్స్ తో మనల్ని టెన్షన్ పెట్టిన విజయ్ శంకర్.. ఎట్టకేలకు మాట్లాడాడందోయ్..!

విజయ్ శంకర్.. నిదహాస్ ట్రోఫీలో ఏమైనా తేడా కొట్టింటే మాత్రం మొత్తం అతన్నే విమర్శించేవారు. మనం మ్యాచ్ గెలిచినా కూడా విజయ్ శంకర్ ను చాలా మంది తిట్టుకునే ఉండి ఉంటారు. మూడు ఓవర్లలో 35 పరుగులు చేయాల్సిన దశలో వరుసగా నాలుగు బంతుల్ని శంకర్ వృథా చేయడంతో టెన్షన్ తారా స్థాయికి చేరింది. మొత్తం ముంచేశాడు కదా విజయ్ శంకర్ అని అనుకున్నారు ప్రతి ఒక్కరూ..! అయితే కార్తీక్ చితక్కొట్టడంతో మ్యాచ్ మన సొంతమైంది. దీనిపై ఇప్పటివరకూ మాట్లాడని విజయ్ శంకర్ ఎట్టకేలకు నోరు తెరిచాడు.

‘ఆ ఐదు బంతుల్ని వృథా చేయడం పట్ల ఇప్పటికీ నేను బాధపడుతున్నాను. మ్యాచ్‌ని ముగించే అవకాశం చాలా అరుదుగా వస్తుంది. కానీ.. నేను చివరి ఓవర్‌లో ఫోర్ బాదిన తర్వాత.. మ్యాచ్‌ని ఫినిష్ చేయలేకపోయా. ఒకవేళ ఫోర్ తర్వాత ఓ సిక్స్ బాదింటే.. ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉండేవి. చివర్లో ఉత్కంఠ రాబోతుందని ఊహించి.. ముందుగానే మానసికంగా సిద్ధమయ్యా. కానీ.. ఒత్తిడిని జయించలేకపోయా. మ్యాచ్ ముగిసిన తర్వాత.. జట్టులోని క్రికెటర్లంతా నాకు మద్దతుగా నిలిచారు. చివర్లో ఒత్తిడికి గురై.. విఫలమైన వాళ్లు చరిత్రలో చాలా మంది ఉన్నారని చెప్పారు. ఐపీఎల్ సమయంలో ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో నేను ప్రాక్టీస్ చేశాను. కానీ.. మ్యాచ్‌లో మాత్రం అతడి బౌలింగ్‌ని ఎదుర్కోలేకపోయా. అతని ఓవర్‌లోనే వరుసగా నాలుగు డాట్ బాల్స్ పడటంతో నాలో ఒత్తిడి తారాస్థాయికి చేరింది. చివర్లో అద్భుతంగా ఆడి మ్యాచ్‌ని గెలిపించిన దినేశ్ కార్తీక్‌కి థ్యాంక్స్’ అని విజయ్ శంకర్ అన్నారు.

భారత్ విజయానికి చివరి మూడు ఓవర్లలో 35 పరుగులు చేయాల్సిన దశలో వరుసగా నాలుగు బంతుల్ని శంకర్ వృథా చేయడంతో మ్యాచ్ దాదాపు టీమిండియా చేజారినట్లు కనిపించింది. ఆ తర్వాత ఓవర్‌లో దినేశ్ కార్తీక్ 22 పరుగులు రాబట్టడంతో మ్యాచ్ మనవైపు తిరిగింది. చివరి ఓవర్‌లో 6 బంతుల్లో 12 పరుగులు కావాలనగా ఒక బంతిని వృథా చేసిన శంకర్ తర్వాత ఫోర్ కొట్టి ఔటయ్యాడు.. దినేశ్ కార్తీక్ చివరి బంతికి సిక్స్ బాదడంతో భారత్ గెలుపొందింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here