పార్థీ గ్యాంగ్ అనే అనుమానంతో..క‌ళ్ల‌ల్లో కారం చ‌ల్లి!

పార్థీ గ్యాంగ్‌. రాష్ట్రంలో ప్ర‌త్యేకించి- రాయ‌లసీమ జిల్లా ప్ర‌జ‌లు, పోలీసుల‌ను కంటిమీద కునుకు లేకుండా చేసిన పేరు ఇది. చిన్న పిల్ల‌ల‌ను ఎత్తుకెళ్లి చంపి, మెద‌డును తింటార‌నే వ‌దంతులు క‌డ‌ప‌, చిత్తూరు, క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల్లో పెద్ద ఎత్తున చెలరేగాయి. దీనిపై పోలీసులు కూడా అప్ర‌మ‌త్తం అయ్యారు. ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేసి, వారి కోసం గాలించారు.

పార్ధీ గ్యాంగ్ అంటూ ఏదీ లేద‌ని నిర్ధారించారు. అయిన‌ప్ప‌టికీ- ప్ర‌జ‌ల్లో భ‌యం పోవ‌ట్లేదు. ప్ర‌స్తుతం ఈ పేరు క‌ర్ణాటక వాసుల‌ను కూడా భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తోంది. పార్థీగ్యాంగ్ అనే అనుమానంతో స్థానికులు క‌ర్ణాట‌క‌-మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దుల్లోని విజ‌య‌పుర జిల్లా సింద‌గి తాలూకా చిక్క‌రూగి గ్రామంలో న‌లుగురిని బంధించారు. అనుమానాస్ప‌దంగా తిరుగుతున్నార‌ని అంటూ క‌ళ్ల‌ల్లో కారం చ‌ల్లి మ‌రీ ప‌ట్టుకున్నారు.

కాళ్లు, చేతులు బంధించి, ఓ గదిలో ప‌డేశారు. మొత్తం 12 మంది అనుమానాస్ప‌దంగా క‌నిపించార‌ని, వారిలో ఎనిమిది మంది త‌ప్పించుకుని పారిపోగా.. న‌లుగురిని బంధించిన‌ట్లు చిక్క‌రూగి గ్రామ‌స్తులు చెబుతున్నారు. అనంత‌రం వారిని దేవ‌రహిప్ప‌రగి పోలీసుల‌కు అప్ప‌గించారు. దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని, విచారిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here