వివాహేత‌ర సంబంధం: రెడ్‌హ్యాండెడ్‌గా దొర‌క‌డంతో..చెట్టుకు క‌ట్టి!

జైపూర్‌: క‌ట్టుకున్న భార్య వివాహేత‌ర సంబంధాన్ని రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నాడో భ‌ర్త‌. భార్య‌, ఆమె ప్రియుడిని చెట్టుకు క‌ట్టి కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. రాజ‌స్థాన్‌లోని బాన్స్‌వాడ జిల్లాలో చోటు చేసుకున్న ఘ‌ట‌న ఇది.

జిల్లాలోని కిష‌న్‌గంజ్ గ్రామానికి చెందిన సూర‌జ్ సింగ్ అనే వ్య‌క్తికి ఆరేళ్ల కింద‌ట రాగిణి (పేరుమార్చాం) అనే యువ‌తితో పెళ్ల‌యింది. కొంత‌కాలంగా ఆమెకు అదే గ్రామానికి చెందిన థ‌నుసింగ్ అనే యువ‌కుడితో వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డింది. శ‌నివారం వారిద్ద‌రూ ఏకాంతంగా గ‌డుపుతున్న విష‌యం తెలిసిన సూర‌జ్‌సింగ్ ఇద్ద‌ర్నీ రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నాడు.

ఇద్ద‌ర్నీ ఊరిలోనే చెట్టుకు క‌ట్టి ప‌డేశాడు. థ‌నుసింగ్‌ను అర్ధ‌న‌గ్నంగ మార్చి, కొట్టారు. అనంత‌రం అత‌ణ్ని వారించిన గ్రామ‌స్తులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు నిందితుల‌ను అరెస్టు చేశారు. ఇద్ద‌రిపై దాడి చేసిన గ్రామ‌స్తులతో పాటు సూర‌జ్‌సింగ్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here