రహానేను పక్కన పెట్టి తప్పుచేశావ్ కోహ్లీ అన్న మాటకు.. కోహ్లీ ఏమి చెప్పాడంటే..!

సౌత్ ఆఫ్రికాతో మొదటి టెస్ట్ మ్యాచ్ లో గెలిచి అద్భుతం సృష్టిస్తుందని భారత్ క్రికెట్ అభిమానులు మొత్తం భావించారు. కానీ అదేమీ జరగలేదు.. అసలు ఇంత మంచి అవకాశం మరోసారి వస్తుందా అని అందరూ అనుకుంటూ ఉన్నారు. ఫాస్ట్ ట్రాక్ పిచ్ పై ఆడటం కష్టమే.. కానీ కొద్దిగా తెలివిగా ఆడి ఉండి ఉంటే.. ఈజీగా లీడ్ సంపాదించి ఉండేవాళ్ళమని.. మన వాళ్ళు భారత్ లో మాత్రమే పులులని మరోసారి తేలిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ మ్యాచ్ లో 72 పరుగుల తేడాతో భారత్ ఓటమిపాలైంది. ముఖ్యంగా రోహిత్ బదులు రహానే ను తీసుకొని ఉండి ఉంటే బాగుండేది కదా అన్న మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ రెండు ఇన్నింగ్స్ లలో 11 పరుగులు, 10 పరుగులు మాతమ్రే చేశాడు. రహానే జట్టులో ఉండి ఉంటే చాలా బాగుండేదని పలువురి అభిప్రాయం.

దీనిపై భారతజట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడని, ఈ నేపథ్యంలో అతన్ని ఎంపిక చేశామని చెప్పాడు. గత మూడు టెస్టుల్లో రోహిత్ అద్భుతంగా ఆడాడని తెలిపాడు. నాలుగేళ్ల క్రితం దక్షిణాఫ్రికా టూర్ లో రహానే అద్భుతంగా రాణించిన విషయం అందరికీ తెలిసిందే. విదేశీ గడ్డపై రహానే అద్భుతంగా ఆడుతాడని అందరికీ తెలిసిందే.. రెండో టెస్ట్ లో రహానే జట్టులో ఉండే అవకాశం లేకపోలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here