కోహ్లీకి కోపం వచ్చింది..!

విరాట్ కోహ్లీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్.. బ్యాట్స్మెన్ ఎంత బాగా ఆడినా కూడా బౌలర్లు మ్యాచ్ లను ముంచేస్తున్నారు. దీనికి తోడు ఫీల్డింగ్ లోపాలు కూడా ఆర్సీబీని పాయింట్ల పట్టికలో ఆఖరికి చేర్చాయి. ఆదివారం కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా బౌలర్లు కనీసం పోరాడలేకపోయారు. ఇక లిన్ ఇచ్చిన ఈజీ క్యాచ్ ను కూడా జారవిడచడంతో ఆర్సీబీ ఓటమిని కొనితెచ్చుకుంది. దీంతో జట్టు సభ్యులపై కోహ్లీ ఫైర్ అయ్యాడు.

కోహ్లీ మాట్లాడుతూ.. ‘మేం బ్యాటింగ్ చేసిన ప్రతిసారీ పిచ్ ఆశ్చర్యపరుస్తోంది. 175 నిజంగా మంచి స్కోరని నేను భావిస్తున్నాను. మేం ఇలాగే కనుక ఫీల్డింగ్ చేస్తే.. మేం ఇక గెలవడానికి అర్హులమే కాదు. మేం మరింత కష్టపడాల్సిన అవసరం ఉంది. బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో మెరుగుపడాలి. తప్పులను సరిదిద్దుకొని ముందుకు వెళ్లాలి. ఇదే విధంగా ఫీల్డింగ్ చేస్తే మేమింక మ్యాచ్‌లు గెలవలేం. ఈ మ్యాచ్‌లో ప్రతి తప్పిదాన్ని నేను గుర్తించలేను. కానీ ఇలాగే ఆడితే మాత్రం కష్టం.. ఇక ప్లే ఆఫ్ చేరాలంటే.. ఆడబోయే 7 మ్యాచుల్లో 6 మ్యాచ్‌లు గెలిస్తేనే అర్హత సాధిస్తాం. ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్‌ను సెమీఫైనల్‌లా ఆడాల్సిన అవసరం ఉంది. అలసత్వం అనే పదానికి ఇక్కడ చోటులేదు. సరైన సమయంలో ఆటగాళ్లంతా పుంజుకోవాలి. వారంతా అర్థంచేసుకుంటారని నాకు నమ్మకం ఉంది’ అని చెప్పుకొచ్చాడు. నిజంగా కోహ్లీ తీరును చూస్తుంటే ప్రతి ఒక్కరికీ బాధగానే ఉంది. అతడు తన స్థానానికి వంద శాతం న్యాయం చేస్తున్నా.. మిగిలిన వాళ్ళు సహకారం ఇవ్వకపోతే ఏమి చేయాలి అని అడుగుతున్నారు కోహ్లీ అభిమానులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here