మరో సచిన్ రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ.. సచిన్ ఊహించింది జరగబోతోంది..!

విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో భారత్ కు మరో విజయాన్ని అందించాడు. మూడో వన్డేలో సౌత్ ఆఫ్రికా బౌలర్లను కోహ్లీ ఆటాడుకున్నాడు. ముఖ్యంగా పరిగెత్తే కోహ్లీ సెంచరీ సాధించాడంటే సఫారీ ఫీల్డర్లను ఎంతగా ఇబ్బంది పెట్టాడో అర్థం చేసుకోవచ్చు. 159 బంతుల్లో 160 పరుగులు సాధించాడు. ఈ సెంచరీతో 34సెంచరీలను సాధించాడు.

ఇక ఈ సెంచరీతో సచిన్ కు చెందిన ఓ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. అదేమిటంటే సౌత్ ఆఫ్రికాలో ఒక వన్డే ఇన్నింగ్స్ లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డుకు ఎక్కాడు. ఇంతకు ముందు సచిన్ నమీబియా మీద 152 పరుగులు సౌత్ ఆఫ్రికా గడ్డ మీదే బాదాడు. సచిన్ 2003 వరల్డ్ కప్ లో నమీబియా మీద 151 బంతుల్లో 152 పరుగులు చేయడం భారత బ్యాట్స్మెన్ గా రికార్డు.. ఆ రికార్డును కోహ్లీ మూడో వన్డేలో సాధించాడు.

విరాట్ కోహ్లీ సచిన్ సాధించిన 100 సెంచరీల రికార్డుకు చాలా దగ్గరగా వస్తున్నాడు. 2012లో సచిన్ టెండూల్కర్ ఊహించాడు. ముంబై ఇండియన్స్ ఓనర్ ముకేష్ అంబానీ ఇచ్చిన పార్టీలో విరాట్ కోహ్లీ లేదా రోహిత్ శర్మ సెంచరీ సెంచరీలు కొట్టొచ్చు అని చెప్పాడు. ఆయన చెప్పినట్లుగా కోహ్లీ దాన్ని అందుకునేందుకు పరిగెడుతున్నాడు. సచిన్ ఊహించింది జరగబోతున్నట్లే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here