ఆ క్యాచ్ కు అవాక్కయిన కోహ్లీ..!

సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లలో కళ్ళు చెదిరే క్యాచ్ లు పడుతూ ఉంటారు. వాటికి మనం ఆశ్చర్యపోకతప్పదు. చూస్తున్న వాళ్ళే కాదు.. బ్యాట్స్మెన్ కూడా అవాక్కయ్యాడంటే ఎంత అద్భుతమైన క్యాచో అర్థం చేసుకోవచ్చు. గత రాత్రి జరిగిన ఢిల్లీ-బెంగళూరు మ్యాచ్ లో కోహ్లీ అవాక్కయ్యాడు. అందుకు కారణం బౌండరీ లైన్ వద్ద ట్రెంట్ బౌల్ట్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడమే..!

చిన్న స్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో కోహ్లీ కొట్టిన బంతిని బౌండరీ లైన్ వద్ద బౌల్ట్ పట్టడం మ్యాచ్ కే హైలైట్. హర్షల్ పటేల్ బౌలింగ్ లో కోహ్లీ షాట్ ఆడగా.. బౌల్ట్ ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ ను అందుకున్నాడు. తాను కూడా బౌండరీ లైన్ కు తగులుతానేమోనని బౌల్ట్ అద్భుతంగా ఆపుకోగలిగాడు. బౌల్ట్ పట్టిన క్యాచ్ కు స్టేడియం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఏమి జరిగింది అని తేరుకోడానికి కొన్ని క్షణాలు పట్టింది అందరికీ..! రీప్లేలో చూడగా బౌల్ట్ ఎంత అద్భుతమైన క్యాచ్ పట్టాడో తెలిసిపోయింది. ఈ మ్యాచ్ లో డివిలియర్స్ అద్భుతంగా ఆడటంతో ఆర్సీబీ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here