దీపికతో నటించనని కోహ్లీ చెప్పలేదు.. అందుకు వేరే కారణం ఉంది..!

బాలీవుడ్ నటి దీపిక పదుకోన్ తో నటించడానికి భారత బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ చెప్పినట్లు మీడియాలో వార్త వైరల్ అవుతోంది. అయితే ఈ వార్తకు క్లారిటీ ఇచ్చింది గోఐబీబో సంస్థ. కోహ్లీ దీపికతో నటించనని చెప్పలేదని.. అతను ఉన్న ఏ ఒక్క యాడ్ లోనూ వేరే సెలెబ్రిటీ ఉండకూడదన్న ఒప్పందం ఉందని అందుకోసమే దీపికతో కలిసినటించకూడదని చెప్పాడని స్పష్టం చేశారు.

ప్రస్తుతం గోఐబీబో యాప్ కు దీపిక పదుకోన్ బ్రాండ్ అంబాసిడర్ గా నటిస్తోంది. ఆ యాడ్ కు మంచి స్పందన వస్తోంది. ఐపీఎల్ టైమ్ లో వేయడానికి మరో యాడ్ ను కోహ్లీతో కలిసి చిత్రీకరిద్దామని అనుకున్నారు ఆ సంస్థ నిర్వాహకులు.. అందుకు ఆర్సీబీతో కూడా 11కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఇదే విషయాన్ని కోహ్లీకి తెలపగా.. దీనికి అతడు నో చెప్పడంతో ఆర్‌సీబీతో ఒప్పందాన్ని రద్దు చేసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ‘మా యాడ్‌లో నటించనని కోహ్లీ నో చెప్పలేదు. ప్రచార కార్యక్రమాల్లో మరో సెలబ్రెటీతో నటించనని మాత్రమే చెప్పాడు’ అని గోఐబిబో నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే ఒప్పో మొబైల్స్‌కి కోహ్లీ, దీపికలు బ్రాండ్ అంబాసిడర్లగా ఉన్న సంగతి తెలిసిందే. కోహ్లీ బ్రాండింగ్ లో ఉన్న కండీషన్ల ప్రకారమే యాడ్ లో నటించనని చెప్పాడు తప్పితే మరేమీ లేదని అన్నారు అతడి సన్నిహితులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here