హైదరాబాద్ వచ్చిన ఆర్సీబీ జట్టు.. మొహమ్మద్ సిరాజ్ ఇంటికి వెళ్ళి ఏమి చేశారంటే..!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఈ ఏడాది ఐపీఎల్ కూడా పెద్దగా కలిసిరాలేదు. ఇక మిగిలిన అన్ని మ్యాచ్ లూ గెలిస్తే తప్పితే ఆర్సీబీకి ప్లే ఆఫ్ ఛాన్స్ లేనట్టే..! ఈరోజు పాయింట్ల పట్టికలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో కోహ్లీ సేన తలపడనుంది. ఆర్సీబీ జట్టులో హైదరాబాద్ రంజీ ప్లేయర్ మొహమ్మద్ సిరాజ్ ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా పోయిన ఏడాది సిరాజ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడాడు.

ఈరోజు మ్యాచ్ కోసం హైదరాబాద్ కు చేరుకున్న ఆర్సీబీ జట్టు సిరాజ్ ఇంటికి వెళ్ళింది. సిరాజ్ ఇంట్లో బిరియానీ పార్టీ చేసుకున్నారు. మన హైదరాబాద్ కు వచ్చిన ఎవరైనా కానీ బిరియానీ రుచి చూడాల్సిందే.. అందుకే హైదరాబాద్ కు రాగానే సిరాజ్ ఇంటికి అందరూ వెళ్ళారు. ఈ ఆదివారం రాత్రి టోలి చౌకీలో ఉన్న సిరాజ్ ఇంటికి వెళ్ళారు. అందరూ కింద కూర్చొని.. బిరియానీని పట్టుపట్టారు. సిరాజ్ తన టీమ్ మేట్స్ కు ఇలాంటి పార్టీ ఇవ్వాలని ఎప్పటి నుండో అనుకుంటూ ఉన్నాడట.. అనుకున్నట్లుగానే ఇచ్చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here