ముంబై శివార్ల‌లో ఆర్థోపెడిక్ క్లినిక్‌లో క‌నిపించిన విరాట్ కోహ్లీ..

టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ అనూహ్యంగా.. ముంబై శివార్ల‌లోని ఓ ఆర్థోపెడిక్ క్లినిక్‌లో క‌నిపించారు. బుధ‌వారం రాత్రి ఆయ‌న ఆ క్లినిక్‌కు వెళ్లారు. బాంద్రాలో ఉన్న ఆ క్లినిక్‌ను ఓ ఆర్థోపెడిక్ స‌ర్జ‌న్ నిర్వ‌హిస్తున్నారు. సుమారు రెండు గంట‌ల పాటు కోహ్లీ ఆ క్లినిక్‌లో గ‌డిపారు. కార‌ణం- ఆయ‌న తీవ్ర మెడ‌, వెన్నునొప్పితో బాధ‌ప‌డుతున్నారు.

ఈ నెల 17వ తేదీన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఫీల్డింగ్ చేస్తూ గాయ‌ప‌డ్డాడు. ఫీల్డింగ్ చేస్తున్న స‌మ‌యంలో అత‌ని మెడ ప‌ట్టేసింది. వెన్నునొప్పి ఆరంభ‌మైంది. అప్ప‌టి నుంచి కోహ్లీ మెడ నొప్పికి తాత్కాలిక మందులు వేసుకుంటూ ఉప‌శ‌మ‌నం పొందారు.

ఐపీఎల్ ప్లే ఆఫ్ రేసు నుంచి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ప్పుకోవ‌డంతో..కోహ్లీ మెడ‌, వెన్నునొప్పికి చికిత్స తీసుకోవ‌డానికి బాంద్రాలోని ఆర్థోపెడిక్ స‌ర్జ‌న్‌ను క‌లిశారు. ఈ విష‌యాన్ని బీసీసీఐ, ఐసీసీ ధృవీక‌రించాయి. దీని ఫ‌లితంగా- కౌంటీ క్రికెట్‌కు కోహ్లీ దూర‌మ‌య్యారు. నిజానికి- ఐపీఎల్ ముగిసిన వెంట‌నే ఆయ‌న స‌ర్రే త‌ర‌ఫున కౌంటీల్లో ఆడాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here