మన టాలీవుడ్ హీరోలు ఒక్కరు కూడా మాట్లాడలేదు.. విశాల్ ధైర్యం చూశారా..?

గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ కోసం తెగ చర్చించుకుంటూ ఉన్నారు. ఒక్క పవన్ కళ్యాణ్ మినహా ఎవరూ ధైర్యంగా ఈ విషయంపై మాట్లాడలేదు. టాలీవుడ్ బడా హీరోలంతా సైలెంట్ గా ఉన్న తరుణంలో తమిళహీరో తెలుగువాడైన విశాల్ దీనిపై స్పందించాడు.

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తాను పోరాడడానికి సిద్ధమని విశాల్ ప్రకటించాడు. త్వరలో విడుదల కాబోతున్న ‘అభిమన్యుడు’ సినిమా ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన విశాల్.. ప్రత్యేక హోదా అంశం మీద మాట్లాడాడు. ఎవరైనా ఏదైనా హామీ ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాల్సిందే అన్నాడు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారు మాట నిలబెట్టుకోవాలన్నాడు. ఏది ఏమైనా విశాల్ ధైర్యాన్ని తెలుగు ప్రజలు మెచ్చుకుంటూ ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో మన హీరోలే సైలెంట్ గా ఉంటే.. విశాల్ మాత్రం ఏ మాత్రం భయపడకుండా తాను సపోర్ట్ చేస్తానని చెప్పుకొచ్చాడు. విశాల్ చాలా కాలంగా మోడీ రాజకీయాలకు వ్యతిరేకంగా గళం విప్పుతూ వస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here