పెళ్ళి కి కళ్యాణ మండపం బుక్ చేసిన విశాల్.. పెళ్ళి కూతురు విషయంలోనే..!

తెలుగు వాడు.. తమిళ హీరో అయిన విశాల్ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాడా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే అతడి పెళ్ళి వెనుక ఉన్న ట్విస్టులు అలాంటివి మరి.. ఎందుకంటే తమిళ పరిశ్రమకు చెందిన ఓ పెద్ద హీరో కూతురితో అతడు లవ్ స్టోరీ నడిపాడు. పెళ్ళి దాకా వెళ్ళింది కూడా.. అందుకే విశాల్ ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకుంటాడా లేక వేరే అమ్మాయితోనా అని చాలా మంది వెయిటింగ్. అయితే తన పెళ్ళికి మండపం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు చెప్పాడు విశాల్.

నడిగర్ సంఘం కార్యదర్శి, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, ప్రముఖ నటుడు అయిన విశాల్‌ మాట్లాడుతూ నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణం వేగంగా జరుగుతోందని అన్నాడు. డిసెంబర్ నాటికి ఈ భవన నిర్మాణం పూర్తవుతుందని తెలిపాడు. జనవరిలో ప్రారంభోత్సవం ఉంటుందని.. ఆ భవనంలోని కళ్యాణ మండపంలో జరిగే తొలి పెళ్లి తనదేనని తెలిపాడు. ఈ మేరకు అడ్వాన్స్ ఇచ్చి మండపాన్ని బుక్ చేసుకున్నానని తెలిపాడు. అదే నోటితో ఆ అమ్మాయి ఎవరో చెబితే చాలా బాగుంటుంది కదయ్యా విశాల్..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here