దీంతో ప్రపంచం లోని ఏ దేశాన్నైనా సర్వ నాశనం చేయొచ్చు.. ఎవరి దగ్గర ఉందంటే..!

ప్రపంచంలోని ఏ దేశాన్నైనా టార్గెట్ చేయగలిగిన మిసైల్ తమ వద్ద ఉందని రష్యా ఇటీవలే ప్రకటించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫెడరల్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ మిసైల్ తో సరితూగేది ఈ ప్రపంచంలో ఎక్కడా లేదని పుతిన్ వ్యాఖ్యానించాడు. ఈ మిసైల్ ను అడ్డుకోవడం కూడా ఎవరితరం కాదని పుతిన్ అన్నాడు. ఐరోపా, ఆసియా దేశాల్లో ఉన్న అమెరికాకు చెందిన షీల్డ్ కూడా ఆపలేవట.

రష్యా న్యూ క్లియర్ క్షిపణులు ఉన్న దేశాల్లో ప్రపంచంలోనే నంబర్ వన్ అని పుతిన్ అన్నాడు. దీన్ని ఉపయోగించి తాము ప్రపంచంలో ఏ మూలనైనా దాడి చేయగలమని చెప్పారు. రాడార్లు కూడా దీనిని కనిపెట్టలేవని ఆయన అన్నారు. దీనితో పాటూ సబ్ మెరైన్ ద్వారా ప్రయోగించే మిసైల్ ను కూడా రష్యా ప్రదర్శనకు ఉంచింది. వీటి పరీక్షలు కూడా విజయవంతమయ్యాయని రష్యా ప్రకటించుకుంది. తాము కొత్త కొత్త ఆయుధాలను తయారు చేయడంలో ముందున్నామని.. ఒకవేళ తమ లాంటి ఆయుధాలను భవిష్యత్తులో ఎవరైనా తయారు చేసినా.. తాము వారి కంటే ముందే ఉంటామని ఆయన అన్నారు.

Image result for putin weapons

Image result for putin weapons

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here