ఓటు హ‌క్కు వినియోగంపై మైసూరు మ‌హారాజు ప్రచారం..!

మైసూరు: క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఓటు హ‌క్కు గురించి ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న‌, చైత‌న్యం క‌లిగించ‌డానికి మైసూరు మ‌హారాజు య‌దువీర్ కృష్ణద‌త్త‌ చామ‌రాజ వ‌డ‌యార్‌.. ప్ర‌చారం చేప‌ట్టారు. స‌రైన అభ్య‌ర్థిని ఎన్నుకోవ‌డానికి వ‌చ్చిన అవ‌కాశాన్ని వ‌దులుకోవ‌ద్ద‌ని సూచించారు. ఓటు వేయ‌డం విస్మ‌రించ‌వ‌ద్ద‌ని అన్నారు.

స్వ‌గ్రామాన్ని, సొంత న‌గ‌రాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవ‌డానికి సామాన్యుల‌కు అందిన అవ‌కాశమ‌ని అన్నారు. స‌రైన నాయ‌కుడిని ఎన్నుకుని, స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని చెప్పారు. డ‌బ్బుకు లొంగ‌వ‌ద్ద‌ని చెప్పారు. ప్ర‌లోభాల‌కు గురి కావ‌ద్ద‌ని అన్నారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపించే ప్ర‌భుత్వాన్ని ఎన్నుకోవాల‌ని ఆయ‌న ఓట‌ర్ల‌కు సూచించారు. ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌ని చెప్పారు. దీనిపై ఓ వీడియోను రూపొందించిన వ‌డ‌యార్‌.. దాన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. శ‌నివారం క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ జ‌రుగ‌నుంది. 15న ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here