ఇతడితో సైనా నెహ్వాల్ లవ్ లో ఉందంటూ రూమర్స్.. నిజమైతే ఎంత బాగున్నో అంటున్న అభిమానులు..!

భారత స్టార్ షెట్లర్ సైనా నెహ్వాల్ ప్రేమలో ఉందంటూ పుకార్లు మొదలయ్యాయి. ఆమె షట్లర్ అయిన పారుపల్లి కశ్యప్ తో ప్రేమలో ఉందని చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా చాలా రోజులుగా వీళ్ళ ప్రేమ మీద రూమర్లు వస్తున్నా వారు ఎప్పుడూ దాన్ని ఖండించలేదు. దీన్ని బట్టి చూస్తుంటే వారు ప్రేమలో ఉంది నిజమేనేమో అనిపిస్తుంది.

https://www.instagram.com/p/BjPuoipFFf2/?hl=en&taken-by=nehwalsaina

ఇక ఇటీవల సైనా నెహ్వాల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఫొటోను అప్ లోడ్ చేసింది. హైదరాబాదులోని ఓ రెస్టారెంటులో ఇద్దరూ కలిసి దిగిన ఓ ఫొటోను ఆమె తన అభిమానులతో పంచుకుంది. క్షణాల్లో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ రెస్టారెంట్ కు గురు సాయి దత్ కూడా వీరితో పాటూ వెళ్ళాడు. ఫోటో తీసింది అతడే..! ఈ ఫోటోలను చూసి పాజిటివ్ గానే అందరూ స్పందించారు. ఇద్దరిదీ పర్ఫెక్ట్ జోడీ అని కొందరు కామెంట్ చేయగా… మీ డేటింగ్ వార్తలను నిజం చేయండి ప్లీజ్ అంటూ మరి కొందరు స్పందించారు. చూద్దాం సమయమే నిర్ణయిస్తుంది వీరి రిలేషన్ షిప్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here