ఓన‌ర్‌పై కోపం..కారుపై చూపారు! ఆడి కారు క్ష‌ణాల్లో బుగ్గి: దాని రేటు..

పుణే: అస‌లే ఆడి కారు. దాని బేసిక్ మోడ‌ల్ రేటే మామూలుగా ఉండ‌దు. ఎంతో ఇష్టం మీద ఆడి మిడిల్ రేంజ్ కారును కొన్నాడో ఆసామి. దాని ధ‌ర 60 ల‌క్ష‌ల రూపాయ‌లు. ఆ కారును తాను నివ‌సించే అపార్ట్‌మెంట్‌లో సెల్లార్‌లో పార్క్ చేశాడు. పార్కింగ్‌లో ఉంచిన ఆ కారును గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కాల్చి ప‌డేశారు.

 

క్ష‌ణాల్లో బుగ్గిపాలైంది అది. మ‌హారాష్ట్రలోని పుణేలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. సెల్లార్‌లో పార్క్ చేసి ఉంచిన కారు వ‌ద్ద‌కు స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నిప్పంటించి పారిపోయారు.

క్షణాల్లోనే కారు బొగ్గ‌యింది. ఆ కారు ప‌క్క‌నే ఉన్న మారుతీ సుజుకీ, హోండా సిటీ కార్లకు కూడా మంట‌లు వ్యాపించాయి. ఆడి కారు యాజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సెల్లార్‌లో అమ‌ర్చిన సీసీటీవీ ఫుటేజీల్లో న‌మోదైన దృశ్యాల ఆధారంగా ద‌ర్యాప్తు చేస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here