స్టీవ్ స్మిత్ తండ్రి త‌న కుమారుడి క్రికెట్ కిట్‌ను ఏం చేశారంటే?

సిడ్నీ: బాల్ ట్యాపంరింగ్ కేసులో ఏడాది పాటు బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన ఆస్ట్రేలియా కేప్టెన్ స్టీవ్ స్మిత్‌కు కుటుంబ స‌భ్యులు షాక్ ఇచ్చారు. స్టీవ్ స్మిత్ తండ్రి పీట‌ర్ స్మిత్ త‌న కుమారుడు వాడే క్రికెట్ కిట్‌ను ఎత్తుకెళ్లి చెత్త‌బుట్ట‌లో ప‌డేశారు. క్రికెట్ కిట్‌ను కారులో తీసుకొచ్చిన ఆయ‌న.. అనంత‌రం దాన్ని ఎత్తుకెళ్లి చెత్త‌బుట్ట‌లో ప‌డేశారు.

దీనికి సంబంధించిన దృశ్యాల‌ను ఆస్ట్రేలియాకు చెందిన `సెవెన్ న్యూస్‌` ఛాన‌ల్ ఎక్స్‌క్లూజివ్‌గా ప్ర‌సారం చేసింది. త‌న కుమారుడికేమీ కాద‌ని, ఈ సంక్షోభం నుంచి అత‌ను త్వ‌ర‌గా కోలుకుంటాడ‌ని తాను ఆశిస్తున్న‌ట్టు.. పీట‌ర్ స్మిత్ చెప్పారు.

బాల్ ట్యాంప‌రింగ్ కేసులో స్మిత్ దోషిగా తేల‌డంతో క్రికెట్ ఆస్ట్రేలియా అత‌నితో పాటు డేవిడ్ వార్న‌ర్‌ను ఏడాది పాటు బ‌హిష్క‌రించిన విష‌యం తెలిసిందే. వారిద్ద‌రితో పాటు ట్యాంప‌రింగ్‌కు పాల్ప‌డుతూ కెమెరా కంటికి చిక్కిన బాన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిదినెల‌ల పాటు నిషేధం విధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here